cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బిగ్‌బాస్ ల‌వ‌బుల్ క‌పుల్ రొమాంటిక్ పిక్ వైర‌ల్‌

బిగ్‌బాస్ ల‌వ‌బుల్ క‌పుల్ రొమాంటిక్ పిక్ వైర‌ల్‌

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్ -4లో మిగిలిన షోల‌తో పోల్చుకుంటే ప్రేమ జంట‌లు ఎక్కువే. ఈ సీజ‌న్‌లో అఖిల్‌, అభిజిత్‌, మోనాల్ మ‌ధ్య కొంత కాలం ట్ర‌యాంగిల్ లవ్ ఎపిసోడ్ షోను ర‌క్తి క‌ట్టించింది. 

మొత్తానికి షోలో మాత్రం ప్రేమ‌కు ఏ మాత్రం త‌క్కువ కాకుండా చివ‌రి వ‌ర‌కూ విజ‌య‌వంతంగా న‌డిపించారు. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు అనుకున్న దాని కంటే ఎక్కువ‌గా కంటెస్టెంట్లు ఎమోష‌న్స్ పండించారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కొన్ని జంట‌ల మ‌ధ్య ప్రేమానుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ముఖ్యంగా బిగ్‌బాస్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా పేరొందిన మోనాల్‌-అఖిల్ మ‌ధ్య హౌస్ బ‌య‌ట కూడా కెమిస్ట్రీ న‌డుస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వారికి సంబంధించి వైర‌ల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు చెబుతున్నాయి. ఇక ప్రాణ‌స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్న సోహెల్ - అఖిల్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా అఖిల్‌, సోహెల్‌లు మోనాల్‌కు రెడ్‌రోజ్ ఇస్తూ కెమెరా ముందు ఫోజులిచ్చారు. మోనాల్‌తో దిగిన ఫొటోల‌ను అఖిల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.  ముఖ్యంగా మోనాల్‌తో అఖిల్ రొమాంటిక్‌గా దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

 


×