cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

దిగొచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్‌

దిగొచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్‌

టీచ‌ర్స్ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఉపాధ్యాయుల బ‌దిలీల్లో హేతుబ‌ద్ధ‌త కొర‌వ‌డి తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. దీంతో త‌మ‌పై ఉపాధ్యాయుల్లో పెద్ద ఎత్తున ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని గ్ర‌హించిన ప్ర‌భుత్వ పెద్ద‌లు అస‌లేం జ‌రుగుతున్న‌దో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే టీచ‌ర్స్‌తో జ‌గ‌న్ స‌ర్కార్ క‌య్యానికి దిగ‌డంపై సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌భుత్వం దిగి రావాల్సి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో ఉపాధ్యాయుల హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌, బ‌దిలీల నిబంధ‌న‌ల్లో మార్పులు చేయాల‌నే ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ నేప‌థ్యంలో ఆ సంఘాల నేత‌ల‌తో బుధ‌వారం సంబంధిత మంత్రి ఆదిమూల‌పు సురేష్ చ‌ర్చ‌లు జ‌రిపారు. చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో ఈ నెల 21న త‌ల‌పెట్టిన జిల్లా డీఈఓ కార్యాల‌యాల పికెటింగ్‌ను విర‌మించుకున్న‌ట్టు ఉపాధ్యాయ సంఘాల స‌మాఖ్య (ప్యాప్టో) చైర్మ‌న్ నారాయ‌ణ తెలిపారు.

విద్యామంత్రితో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ముఖ్యంగా  పాఠ‌శాల ప్రాంతం పాయింట్ల‌ను 8 నుంచి 11 ఏళ్ల వ‌ర‌కూ పెంచుతామ‌ని, స‌ర్వీస్ పాయింట్ల‌ను 31 ఏళ్ల వ‌ర‌కూ పంచుతామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. అలాగే ఎస్జీటీ బ‌దిలీల కౌన్సెలింగ్‌ను మాన్యువ‌ల్‌గా నిర్వ‌హించాల‌నే డిమాండ్‌పై కూడా ప్ర‌భుత్వం సానుకూలంగా ప‌రిశీలించింది. 

ముందుగా కొత్త సాప్ట్‌వేర్‌పై డెమో ఇస్తామ‌ని, దానిపై ఉపాధ్యాయులు సంతృప్తి చెంద‌క‌పోతే మాన్యువ‌ల్‌గా నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌మ‌క్షంలో ఉన్న‌త విద్యాశాఖాధికారులు హామీ ఇచ్చారు.

అలాగే ఆన్‌లైన్‌లో విద్యార్థుల సంఖ్య నమోదులో తప్పులపై ప్రధానోపాధ్యాయులు అప్పీలు చేస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం సానుకూల వాతావ‌ర‌ణంలో స్పందించ‌డంతో ఈ నెల 21న త‌ల‌పెట్టిన ఆందోళ‌న‌ను ఉపాధ్యాయ సంఘాలు విర‌మించాయి.  

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ...ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం

 


×