Advertisement

Advertisement


Home > Politics - Political News

ఢిల్లీ నుంచి గల్లీకి....

ఢిల్లీ నుంచి గల్లీకి....

విశాఖ ఉక్కు ఉద్యమానికి కూడా ఆరు నెలల వయసు వచ్చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామన్న విషయాన్ని కేంద్రం చెప్పిన వెంటనే ఫిబ్రవరిలో ఉక్కు పోరు రాజుకుంది. నాటి నుంచి నేటి వరకూ అలుపెరగని రీతిన కార్మికులు ఉద్యమిస్తున్నారు.

ఈ మధ్యలో ఢిల్లీ కూడా వెళ్ళారు. అక్కడ ఉక్కు గర్జనను కేంద్ర పెద్దల చెవుల పడేలా వినిపించారు. అయినా కూడా కేంద్రం అదే ప్రైవేటు పాటనే పదే పదే పాడుతోంది. ఇపుడు మళ్ళీ గల్లీలో ఉద్యమం ఊపందుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారం అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని చుట్టుముట్టి మరీ కార్మికులు తన డిమాండ్లను వినిపించారు.

ఎవరైనా కొనేందుకు వచ్చినా వచ్చినా కూడా తమను దాటి ముందుకు వెళ్ళలేడంటూ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు గట్టిగానే స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అన్న చర్చ కూడా సాగుతోంది. అందుకేనా ఎవరు ప్లాంట్ ని కొన్నా లోపలికి అనుమతించమని కార్మికులు సరికొత్త నినాదాలు ఇస్తున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే గల్లీతో మొదలైన ఉక్కు పోరు ఢిల్లీని తాకింది. మళ్ళీ విశాఖలోనే చేస్తోంది. సాగు చట్టాల మీద రైతులు చేస్తున్న పోరు మాదిరిగానే ఇది సుదీర్ఘంగా సాగుతోంది. కేంద్రం మాత్రం తన పని తాను చేసుకునుకి పోతోంది. ఈ నేపధ్యంలో ఉక్కు ఉద్యమం ఎక్కడ ఉంది అంటే ఉన్న చోటనే అన్న మాట కూడా వినిపిస్తోంది. 

కేంద్రం వింటే ఏ ఉద్యమం అయినా సక్సెస్ అవుతుంది. వినకుండా మొండికేస్తే, రాజే మొండిగా మారితే ఉద్యమ కధలన్నీ కూడా తీరని  వ్యధలుగానే మారుతాయని కార్మిక నాయకులు అంటున్నారు. మొత్తానికి ఉక్కు పోరాట స్పూర్తిని ఎవరూ కాదనడంలేదు, కేంద్రం మొండి వైఖరిని మాత్రమే తప్పు పడుతున్నారు. 

ఈ క్రమంలో ఉక్కు పోరాటం మరెన్ని నెలలు సాగుతుందో చూడాలి. ఈ మధ్యలోనే అమ్మకాలు పూర్తి చేసి తెర దించేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?