cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఇంత ధైన్య‌మా!

చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీకి ఇంత ధైన్య‌మా!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లాలో ఆయ‌న పార్టీ అత్యంత ధైన్య స్థితిని అనుభ‌విస్తూ ఉంద‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఫిరాయింపుల‌తో నేత‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు లేపుకొచ్చారు. అలాంటి వారు తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున నెగ్గ‌లేక‌పోయారు. 

అదే స‌మ‌యంలో పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్లు కూడా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం మానేస్తూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున క‌నీసం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జిల‌ను ఎంపిక చేయ‌డం కూడా క‌ష్టం అవుతున్న‌ట్టుగా భోగ‌ట్టా!

కేవ‌లం చిత్తూరు అనే కాదు.. చాలా చోట్ల అదే ప‌రిస్థితి. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంద‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌లు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో యాక్టివ్ పాలిటిక్స్ కూ దూరం అయిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  అంత‌కు ముందు ఐదేళ్ల చంద్ర‌బాబు నాయుడి పాల‌న తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయ‌డం మాట అటుంచి, ఆ పార్టీ బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి నేత‌లెవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితిని ఏర్ప‌రిచిన‌ట్టుగా ఉంది!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక్కోరి మాట‌లూ కోట‌లు దాటేవి. ఎక్క‌డో విశాఖ నుంచి వ‌చ్చి రాయ‌ల‌సీమ‌లో తొడ‌లు కొట్టే వాళ్లు తెలుగుదేశం నేత‌లు. పులివెందుల్లో జ‌గ‌న్ ను ఓడిస్తామంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లికేవారు. తీరా ఎన్నిక‌లు జ‌రిగితే చంద్ర‌బాబు నాయుడి మెజారిటీ స‌గం పోయింది!

ఎన్నిక‌లు జ‌రిగి దాదాపు 15 నెల‌లు గ‌డుస్తున్నా ప్ర‌తిప‌క్షంగా టీడీపీ యాక్టివిటీస్ ఏమీ లేవు. ఎంత‌సేపూ అమ‌రావ‌తి, కోర్టు తీర్పులు త‌ప్ప తెలుగుదేశం పార్టీకి మ‌రో ఇష్యూ లేకుండా పోయింది. వాటి ద్వారా వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఎంతో చంద్ర‌బాబు నాయుడుకే తెలియాలి!

అమ‌రావ‌తి ఉద్య‌మం ఇప్ప‌టికే మూడు వంద‌ల రోజులు జ‌రిగింద‌ట‌, ఆ ఉద్య‌మం మ‌రో మూడు వంద‌ల రోజులు జ‌రిగినా, మూడు సంవ‌త్స‌రాల పాటు జ‌రిగినా టీడీపీని అయితే అది అధికారంలోకి తీసుకురాలేదు. క‌నీసం ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా ఆ ఉద్య‌మం గెలిపించ‌గ‌లిగేలా లేదు.

సొంత జిల్లాలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌నీసం ఇన్ చార్జిల‌ను నియ‌మించుకోలేని స్థితిలో ఉన్నారు చంద్ర‌బాబు నాయుడు. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి మీసాలు తిప్పిన వారు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎక్క‌డ ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. చంద్ర‌బాబు సొంతూరు ఉన్న చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జి స్థానం నుంచి గ‌ల్లా అరుణ‌కుమారి కొంత‌కాలం కింద‌టే త‌ప్పుకున్నారు. టీడీపీలో మ‌రో ప‌ద‌వికి కూడా ఆమె ఈ మ‌ధ్య‌నే రిజైన్ చేశారు.

చిత్తూరు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎవ‌రో అనామ‌కుడిని, పంచాయ‌తీ ప్రెసిడెంట్ స్థాయి వ్య‌క్తిని ఇన్ చార్జిగా ప్ర‌క‌టించారు. తిరుప‌తి లోక్ స‌భ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగితే.. టీడీపీ పోటీ చేయాల‌న్నా అభ్య‌ర్థి దొర‌క‌ని ప‌రిస్థితి ఉంది. క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు ఇలా ఉంటే.. చంద్ర‌బాబు నాయుడు మాత్రం హైద‌రాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగుల ద్వారా అమరావ‌తి కోసం స‌మ‌యాన్ని వెచ్చిస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం!

దేశం దృష్టిలో ఇప్పుడు జగన్ ఒక హీరో