cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మళ్లీ ఢిల్లీకి జగన్.. బాబులో ఒకటే టెన్షన్

మళ్లీ ఢిల్లీకి జగన్.. బాబులో ఒకటే టెన్షన్

ఓవైపు 2వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తుల్ని కనుగొంది ఆదాయపు పన్నుశాఖ. స్వయానా చంద్రబాబు పేరు ఈ మొత్తం వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు జగన్ బ్యాక్ టు బ్యాక్ ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది. మరీ ముఖ్యంగా ఈరోజు కేంద్ర హోం మంత్రితో జగన్ భేటీ కానున్న నేపథ్యంలో.. పచ్చ బ్యాచ్ లో టెన్షన్ పీక్ స్టేజ్ కు చేరుకుంది.

ఈరోజు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్. హోమ్ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమౌతారు. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా గంటన్నర పాటు సమావేశమైన జగన్, ఈరోజు అమిత్ షాతో దాదాపు రెండు గంటలకు పైగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ ఒక్క భేటీతో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు కొలిక్కి రావడం ఖాయం.

మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు, కొన్ని విభజన అంశాలపై ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది హోం శాఖ మాత్రమే. వీటిలో చాలా సమస్యలకు ఈరోజు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది. పనిలోపనిగా చంద్రబాబు వ్యవహారం కూడా చర్చకు రావడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మేం బీజేపీకి వ్యతిరేకం కాదు.. మోడీ-అమిత్ షాకు వ్యతిరేకం అంటూ గత ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలకు దిగారు చంద్రబాబు. మోడీలేని భారతాన్ని తీసుకురావడమే తన ఆశయంగా ప్రకటించుకున్నారు. అవన్నీ మోదీ-షా ద్యయానికి గుర్తున్నాయి. మంచి సమయం కోసం మాత్రమే వేచి చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చిందంటున్నారు చాలామంది.

పోలవరం అవకతవకలు, నీరు-చెట్టు అక్రమాలు, రాజధాని భూములతో పాటు.. ఇప్పుడు 2వేల కోట్ల రూపాయల ఐటీ బాగోతం కూడా వెలుగులోకి రావడంతో.. చంద్రబాబు చుట్టూ వల బిగుసుకుంది. జగన్-అమిత్ షా పర్యటన వివరాలు ఈరోజు రాత్రికి బయటకొచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుపై కేంద్రం వైఖరి మాత్రం తెలియాలంటే, బాబుపై ఈరోజు జరగనున్న సమావేశం సారాంశం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

పెళ్లి గురించి నితిన్ మాటల్లో

 


×