cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

చట్టబద్ధంగానే విశాఖకు రాజధాని?

చట్టబద్ధంగానే విశాఖకు రాజధాని?

కొత్త ఏడాది అనేక కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం  ఉందా అంటే జవాబు అవును అనే వస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదన చేసి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. 

అన్నీ అనుకూలించి ఉంటే గత ఏడాది ఉగాది నాటి నుంచే విశాఖలో పాలన మొదలయ్యేది. అయితే ఆలస్యం అయినా కూడా మంచి పనులకు ఎపుడూ సుదీర్ఘమైన ఆటంకాలు ఉండవని అంటున్నారు. 

అందువల్ల మరో నాలుగు నెలల వ్యవ‌ధిలో విశాఖ పాలనారాజధానిగా మారడం ఖాయమని చెబుతున్నారు. అంతా చట్టబధ్ధంగానే జరుగుతుందని కూడా వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

విశాఖ రాజధాని తరలింపు విషయంలో   ఈసారి మాటల కంటే చేతలే ఉంటాయని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖకు రాజధాని రావడం ఖాయమని పేర్కొన్నారు.

ఇపుడు ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఇదే మాట చెబుతూ పక్కా క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి కాస్తా లేటు అయినా విశాఖకు న్యాయమే జరుగుతుందని వైసీపీ పెద్దల మాటల ద్వారా అర్ధమవుతోంది. ఆ రోజు కోసం పోర్టు సిటీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది మరి.

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

 


×