cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బుద్ది లేని రాతలు

బుద్ది లేని రాతలు

విశాఖపట్నంలో ఇప్పుడు వున్న విమానాశ్రయాన్ని మూసేయాలా? భోగాపురం విమానాశ్రయం నుంచే రాకపోకలా? ప్రయాణికుల అభిప్రాయాలు అవసరం లేదా? ఇదంతా ఎవరి మేలు కోసం? విజయసాయిపై జనం ఆగ్రహం..

ఇవీ..తెలుగుదేశం అను'కుల' మీడియా రాతలు. ఈ రాతలు రాసిన వారికి కనీసపు పరిజ్ఞానం వుందనుకోవాలో? లేదనుకోవాలో? లేదా కేవలం జనాలను రెచ్చగొట్టడమే పరమార్థం అనుకోవాలో?

విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వమే భోగాపురం ను ఎంపిక చేసింది. ఇక్కడ తెలియాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం విశాఖలో వున్న విమానాశ్రయం ఎయిర్ పోర్టు అథారిటీది కాదు. అది రక్షణశాఖకు చెందినది. రక్షణ శాఖ ఆధీనంలో వున్నదాన్నే పౌర విమాన శాఖ నిర్వహిస్తోంది.అక్కడ విస్తరణకు అవకాశం లేదు. 

అందుకే నలభై కిలోమీటర్ల దూరంలోని భోగాపురం దగ్గర స్థలాన్ని ఎంపిక చేసింది చంద్రబాబే. జిఎమ్ఆర్ ను ఎంపిక చేసింది చంద్రబాబే. అయితే దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నది మాత్రం వైకాపా ప్రభుత్వం.

ఇప్పుడు విశాఖలో పౌరవిమానాశ్రయాన్ని కొనసాగించే విషయం చూద్దాం. ఇది కొనసాగించడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎప్పటి నుంచో తమకు దాన్ని వదిలేయాలని రక్షణ శాఖ కోరుతోంది. పోనీ కొనసాగించడానికి రక్షణశాఖకు అభ్యంతరం లేదునుకుందాం. 

అప్పుడు వేల కోట్ల అప్పు తెచ్చి విమానాశ్రయం నిర్మించే జిఎమ్ఆర్ పరిస్థితి ఏమిటి? ఎక్కడ నుంచి ఆదాయం వస్తుంది? సగం విమానాలు అక్కడ, సగం విమానాలు ఇక్కడ అయితే పరిస్థితి ఏమిటి?

ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఏం జరిగింది అన్నది కూడా చూడాలి. హైదరాబాద్ లో సెంట్రల్ ప్లేస్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ వుండేది. అలాంటి టైమ్ లో శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. అప్పుడేం జరిగింది. 

బేగంపేట నుంచి డొమస్టిక్ విమానాలు నిర్వహించాలని డిమాండ్ వచ్చింది. కానీ దానికి అప్పటి ప్రభుత్వం కానీ జిఎమ్ఆర్ కానీ అంగీకరించలేదు. కారణం మళ్లీ మామూలే, వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తరువాత దానికి అడ్డంపడే విధానాలకు ఎందుకు ఒప్పుకుంటుంది. జనం బేగంపేట వదిలి నలభై కిలో మీటర్ల దూరంలోని శంషాబాద్ కు అలవాటు పడాల్సి వచ్చింది.

ఆ సమయంలో అన్ని ప్రాంతాల నుంచి బస్ లు రన్ చేస్తామని జిఎమ్ఆర్ మాట ఇచ్చింది. కొన్నాళ్లు రన్ చేసింది. దాన్ని తరువాత స్మూత్ గా బస్సులు వదిలించుకుని ఆ భారం ఆర్టీసీ మీద పడేసారు.

బెంగుళూరు విషయంలోనూ ఇలాగే జరిగింది. సిటీకి ఓ మూలన దూరంగా కొత్త విమానాశ్రయం నిర్మించారు. సిటీలోకి వెళ్లాంటే రెండు గంటలు పడుతుంది. 

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను

 


×