Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎట్టకేలకు దారికొచ్చిన పవన్ కల్యాణ్

ఎట్టకేలకు దారికొచ్చిన పవన్ కల్యాణ్

"ఢిల్లీకి వెళ్తున్నాను. మీ అందరికీ మాటిస్తున్నాను. అమరావతి మాత్రం ఇక్కడ్నుంచి కదలదు. కేంద్రాన్ని నేను కదిలిస్తాను." సరిగ్గా 24 గంటల కిందట పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇది. 

"3 రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినది. రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంటే కేంద్రం అదే చేస్తుంది. దీంట్లో కేంద్రం సమ్మతి-అసమ్మతి అనే చర్చ లేదు." సరిగ్గా 24 గంటల తర్వాత ఢిల్లీ నుంచి పవన్ కల్యాణ్ చెప్పిన మాట ఇది.  

ఇలా 24 గంటల్లోనే దారిలోకొచ్చారు పవన్. కేంద్రంతో చర్చలు జరిపి, 3 రాజధానుల ఏర్పాటును నిలిపివేస్తానంటూ గాలిశపథాలు చేసిన పవన్.. ఢిల్లీ వెళ్లి డమ్మీ అయ్యారు. 3 రాజధానుల అంశంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని స్థానికంగా నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నప్పటికీ చెవికి ఎక్కించుకోని పవన్.. ఆ విషయాన్ని ఢిల్లీ వెళ్లి తెలుసుకున్నారంతే.

కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, జీవీఎల్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో గంట సేపు చర్చించారట. రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలను ఆమెకు వివరించారట. ఇలా నిర్మాలా సీతారామన్ తో గంటసేపు చర్చించిన తర్వాత.. 3 రాజధానుల అంశంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని విషయాన్ని తెలుసుకున్నట్టున్నారు పవన్. 

ఇంత పరాభవం జరిగినా పవన్ వెనక్కి తగ్గలేదు. 3 రాజధానుల నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదని ఒప్పుకుంటూనే, జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కేంద్రానికి సమ్మతం కాదని అంటున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా బీజేపీతో కలిసి కూర్చొని త్వరలోనే కార్యాచరణను సిద్ధం చేస్తామని ప్రకటించారు. 

ఇదంతా చూస్తుంటే ఇక్కడ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఒకటి తాజా పొత్తులో భాగంగా భారతీయ జనతాపార్టీ పెద్దల్ని కలిసేందుకే పవన్ ఢిల్లీకి వెళ్లారు. ఇక రెండోది, 3 రాజధానుల అంశానికి వ్యతిరేకంగా మాట్లాడ్డం ద్వారా ప్రజల్లో బ్యాడ్ అవ్వడం మినహా మరేదీ సాధించలేమని గ్రహించారు. ఇప్పటికైనా జనసేనాని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది.

ఇక ఢిల్లీలో కొసమెరుపు ఏంటంటే.. రాజధాని అంశంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని విషయం పవన్ కు అప్పుడే తెలిసిందట. దీనికి కొనసాగింపుగా మీడియా ఏదో అడగబోతే సమాధానం చెప్పకుండా సైడ్ అయిపోయారు పవన్. దీనికితోడు ఎలాంటి ప్రాధాన్యం లేని వ్యక్తిగా బీజీపీ నేతల వెనక పవన్ నిలబడ్డారు.

బుచ్చయ్య చౌదరి తొడలు కొట్టుకుంటూ అసెంబ్లీ లో తిరుగుతున్నాడు  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?