cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రాజ‌కీయ తెర‌పై గుర్తింపు కోసం సీనియ‌ర్‌ న‌టి త‌హ‌త‌హ‌

రాజ‌కీయ తెర‌పై గుర్తింపు కోసం సీనియ‌ర్‌ న‌టి త‌హ‌త‌హ‌

టీడీపీ నాయ‌కురాలు దివ్య‌వాణి రాజ‌కీయ తెర‌పై ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు ఆమె పంథా చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. గుంటూరు జిల్లాకు చెందిన దివ్య‌వాణి స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు చిత్రంలో బాల న‌టిగా తెరంగేట్రం చేశారు.  ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో ఈ సినిమా వ‌చ్చింది. 2018లో బంప‌ర్ హిట్ కొట్టిన మ‌హాన‌టిలో కూడా ఈమె న‌టించారు.

మూడు ద‌శాబ్దాల‌కు పైబ‌డి సినిమానే లోకంగా బ‌తికినా ....చెప్పుకో త‌గ్గ గుర్తింపున‌కు ఆమె నోచుకోలేక‌పోయారు. అమె అస‌లు పేరు ఉషారాణి. స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు సినిమా త‌ర్వాత క‌న్న‌డ సినిమాలో ఆమె న‌టించారు. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ద్వార‌కేష్ ఉషారాణి పేరును దివ్య‌వాణిగా మార్చారు. ఆయ‌న పేరైతే మార్చ‌గలిగారే గానీ, ఇండ‌స్ట్రీలో స్టార్ చేయ‌లేక‌పోయారు.

మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో ఆమెకు  పెళ్లి పుస్త‌కం, మొగుడు పెళ్లాల దొంగాట సినిమాలు చెప్పుకోత‌గ్గ గుర్తింపు తెచ్చాయి. ప్ర‌స్తుతం ఆమె టీడీపీలో కొన‌సాగుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీలైన వైసీపీ ముఖ్య నాయ‌కుల‌పై అప్పుడ‌ప్పుడు తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతుంటారు. ముఖ్యంగా త‌న రంగానికే చెందిన న‌గ‌రి ఎమ్మెల్యే రోజాపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు దివ్య‌వాణి ముందు వ‌రుసలో ఉంటారు.

తాజాగా రోజాపై ఆమె మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేద‌ని దివ్య‌వాణి అన్నారు. శ‌వ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌సైన వైసీపీలో ఉంటూ సంప్ర‌దాయాల గురించి రోజా మాట్లాడ్డం విడ్డూరంగా ఉంద‌న్నారు. 

నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారని దివ్య‌వాణి ప్రశ్నించారు. దుర్గాప్రసాద్ కొడుక్కి ఎందుకు ఎంపీ టికెట్‌ ఇవ్వలేదని దివ్యవాణి ప్రశ్నించారు. ఇంకా అనేక ప్ర‌శ్న‌ల‌ను వైసీపీపై ఆమె సంధించారు.

దివ్య‌వాణి ప్ర‌శ్న‌లు, విమర్శ‌లు వింటుంటే కొత్త భిక్ష‌గాళ్లు పొద్దెర‌గ‌ర‌నే సామెత ఎవ‌రికైనా గుర్తు రాక త‌ప్ప‌దు. ఎందుకంటే నంద్యాల ఉప ఎన్నిక‌లో జ‌గ‌న్ త‌మ అభ్య‌ర్థిని ఎందుకు నిల‌బెట్టార‌ని ప్ర‌శ్నిస్తున్న దివ్య‌వాణికి, ఇదే తిరుప‌తి అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌మ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేద‌నే విష‌యం తెలుసో లేదో మ‌రి!

నంద్యాల‌లో భూమా నాగిరెడ్డి వైసీపీ త‌ర‌పున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. అంటే అది వైసీపీ సీటు అన్న‌మాట‌. అందుకే జ‌గ‌న్ అక్క‌డ త‌న అభ్య‌ర్థిని నిలిపారు. ఇదే తిరుప‌తి ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణ ఆక‌స్మిక మృతి చెందితే, అక్క‌డ వైసీపీ అభ్య‌ర్థిని నిల‌ప‌లేదు. సంప్ర‌దాయాల గురించి దివ్య‌వాణి మాట్లాడే ముందు అన్ని విష‌యాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో మంత్రి కొడాలి నానిపై దివ్య‌వాణి విమ‌ర్శ‌లు మిస్ ఫైర్ అయ్యాయి. దీంతో సోష‌ల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జ‌రిగాయి. ఇప్పుడు మ‌రోసారి అలాంటి ప‌రిస్థితే. రాజ‌కీయ తెర‌పై గుర్తింపు పొందాల‌న్న దివ్య‌వాణి ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం విజ‌యం సాధిస్తాయో కాల‌మే జ‌వాబు చెప్పాలి. 

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను

 


×