cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎయిర్ పోర్ట్ మీద ఏడుపు స్టార్ట్ ?

ఎయిర్ పోర్ట్ మీద ఏడుపు స్టార్ట్ ?

అభివృద్ధి చేయబోతే అడ్డుకుంటారు, మరో వైపు ఏమీ చేయలేదు అని విమర్శలు చేస్తారు. ఇదీ విపక్షం తీరు అంటూ మండుతున్నారు వైసీపీ నేతలు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని నిర్మించడానికి వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే జీఎమ్మార్ కి టెండర్లు ఖరారు అయ్యారు. త్వరలో జగన్ శంఖుస్థాపన చేస్తారు.

అయితే తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి రాసిన‌ ఒక లెటర్ పట్టుకుని అటు టీడీపీ ఇటు జనసేన కూడా రాజకీయం మొదలెట్టాయి. ఆ లెటర్ లో ఏముందంటే భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చాక ముప్పయ్యేళ్ళ పాటు విశాఖలోని ఎయిర్ పొర్ట్ మూసేయమని ఉంది.

దాంతో టీడీపీ అనుకూల మీడియా అయితే ఇవాళో రేపో విశాఖ ఎయిర్ పోర్టుని మూసేస్తున్నారు అన్నట్లుగా రాతలు రాస్తే జనసేన నాయకులు విశాఖను విద్వంశం చేస్తోంది వైసీపీ అంటూ కారాలూ మిరియాలూ నూరారు.  దీని మీద విజయసాయిరెడ్డి చర్చకు నేను రెడీ అంటున్నారు. విశాఖ అభివృద్ధికి విఘాతం కలిగించాను అని నిరూపించాలని సవాల్ చేస్తున్నారు. అది టీడీపీ హయాంలోనే విధించిన  నిబంధన అని కూడా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే విశాఖ ఎయిర్ పోర్ట్ నేవల్ కమాండ్ ఆధీనంలో ఉంది. అది అందరికీ తెలిసిందే. విస్తరణకు కూడా అవరోధాలు ఉన్నాయి. దాంతో పూర్తి స్థాయి విమానాశ్రయం కోసమే భోగాపురం దగ్గర నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ టీడీపీకి, దాని  అనుకూల మీడియాకూ బాగా తెలుసు.

కానీ ఇపుడు మాత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేస్తున్నారు అంటూ పెద్ద గొంతుతో రచ్చ చేస్తున్నారు. దాని వల్ల భోగాపురానికి ముందే నెగిటివిటీ పెంచేసి ఆ నిర్మాణాన్ని ఆపేందుకు ఆడుతున్న నాటకమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తం మీద చూస్తే ఎయిర్ పోర్ట్ మీద కూడా ఏడుస్తూ అభివృద్ధిని అడ్డుకున్నారని అధికార పార్టీ అంటోందంటే అర్ధముందిగా.

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను

 


×