cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ దెబ్బ‌తో పారిపోయిన అతి పెద్ద ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్‌

జ‌గ‌న్ దెబ్బ‌తో పారిపోయిన అతి పెద్ద ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్‌

ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏపీ నుంచి ప‌రిశ్ర‌మ‌లన్నీ త‌ర‌లిపోయాయి, పోతున్నాయ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు ఆ పార్టీ కొమ్ము కాసే ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌చారంలో నిజం లేక‌పోలేదు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే 40 ఏళ్ల ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ త‌న కుమారుడితో క‌లిసి త‌ట్టాబుట్టా స‌ర్దుకుని హైద‌రాబాద్‌కు పారిపోయారు. ఆ వివ‌రాలేంటంటే....

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చాలా రోజుల త‌ర్వాత ట్విటర్ మీద నుంచి నేల మీద‌కి దిగారు. రాజ‌ధాని ప్రాంత ఆందోళ‌న 300 రోజుల‌కు చేరిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని లోకేశ్ ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా పెనుమాక‌లో దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి లోకేశ్  ముచ్చ‌టేసే మాట‌లు చెప్పుకొచ్చారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు అనేక కంపెనీలు విశాఖ‌కు తీసుకెళ్లామ‌న్నారు. జ‌గ‌న్ వ‌చ్చాక ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ ఏపీ త‌ర‌లిపోయా య‌ని విమ‌ర్శించారు. గ‌త 17 నెల‌ల కాలంలో ఒక్క ప‌రిశ్ర‌మ కూడా ఏపీకి రాలేద‌ని తూర్పార‌ప‌ట్టారు.

లోకేశ్ విమ‌ర్శించిన‌ట్టు జ‌గ‌న్ వ‌చ్చాక ప‌రిశ్ర‌మ‌ల త‌ర‌లింపు సంగ‌తి అలా ఉంచితే ...ఆయ‌న చెప్పిందాంట్లో ఒక్క‌టి మాత్రం నిజం ఉంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ నుంచి పారిపోయిన వారిలో 40 ఏళ్ల పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్‌ చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడైన చిన్న పారిశ్రామిక‌వేత్త లోకేశ్ ఉన్నారు. 

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ...ఇక ఏపీతో త‌న‌కు ప‌నిలేద‌నే ఆలోచ‌నో, లేక ఘోరంగా ఓడించార‌నే అక్క‌సో తెలియ‌దు కానీ ...కొడుకుతో సహా హైద‌రాబాద్‌కు బాబు త‌ర‌లిపోయారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా క‌ట్టుకున్న అంద‌మైన ఇంటిలో చంద్ర‌బాబు, లోకేశ్ త‌మ కుటుంబ స‌భ్యుల‌తో చ‌క్క‌గా సెటిల్ అయ్యారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ 16 నెల‌ల్లో చంద్ర‌బాబు, లోకేశ్‌ హైద‌రాబాద్‌లోనే దాదాపు ఉండిపోయారు. అప్పుడ ప్పుడు చుట్ట‌పు చూపుగా త‌ప్ప తండ్రీకొడుకులు ఏపీలో స్థిరంగా ఉండేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. 

లాక్‌డౌన్ స‌మ యంలో పూర్తిగా హైద‌రాబాద్‌లోనే ఉన్న విష‌యం తెలిసిందే. కావున లోకేశ్ , చంద్ర‌బాబు తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ...జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌ర‌లిపోయింది తామే త‌ప్ప ప‌రిశ్ర‌మ‌లు కాద‌ని. ఈ విష‌యం వాళ్లిద్ద‌రి అంత‌రాత్మ‌ల‌కు బాగా తెలుసు.

న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించిన జగన్

 


×