cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

జ‌గ‌న్ లేఖ‌పై ఉండ‌వ‌ల్లి స్పంద‌న ఏంటంటే...

జ‌గ‌న్ లేఖ‌పై ఉండ‌వ‌ల్లి స్పంద‌న ఏంటంటే...

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ లేఖ రాయ‌డంపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కోర్టుల‌పై ముఖ్య‌మంత్రి లేఖ రాయ‌టం ఇదేమీ కొత్త కాద‌ని తేల్చి చెప్పారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి సంజీవ‌య్య కూడా 1960లోనే కోర్టుల‌పై లేఖ రాసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

లేఖ రాయటం కంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం తప్పా? రైటా అనే విషయం పైనే చర్చ జరుగుతోంద‌న్నారు. జగన్ అన్ని విషయాల్లో మొండిగా వెళతారన్నారు. జస్టిస్ రమణ విషయంలో ఆరోపణలు వ్యక్తిగతంగా తాను నమ్మనన్నారు. 

న్యాయ వ్యవస్థలో లోపాలను రాజకీయ వ్యవస్థలు సరిదిద్దాలని కోరారు. చట్టం ముందు జడ్జీలు అతీతులు కాద‌న్నారు. న్యాయ వ్యవస్థలపై ఆరోపణలు విషయంలో చర్చ గౌరవంగా జరగాల‌ని ఉండ‌వ‌ల్లి ఆకాంక్షించారు. లక్ష కోట్లు తినేసిన జగన్‌కు ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఏం చేయాలో టీడీపీ ఆలోచించుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి స‌ల‌హా ఇచ్చారు.

రాజకీయ నాయకులపై కోర్టులో విచారణ జరిగినప్పుడు లైవ్ ఇవ్వాలన్నారు. కోర్టులో విచారణ లైవ్ టెలీకాస్ట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయ‌న్నారు. ఏపీని 15 సంవత్సరాలు పాటు పరిపాలించిన చంద్రబాబు కేసులు, నేటి ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులు విషయంలో లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. 

కృష్ణమ్మ పరవళ్లు

 


×