Advertisement

Advertisement


Home > Politics - Political News

పారిశ్రామిక కారిడార్ గా విశాఖ

పారిశ్రామిక కారిడార్ గా విశాఖ

ఏపీలో  ఇండస్ట్రియల్  పొటెన్షియాలిటీ ఉన్న మెగా సిటీగా విశాఖనే ఎవరైనా  ముందు చెబుతారు. అన్ని రకాలైన ట్రాన్స్ [పోర్ట్ సదుపాయాలు కలిగిన విశాఖ మీద ఆసియా దేశాల కన్ను ఎపుడూ ఉంది.  పెట్టుబడులు విశాఖలో పెట్టడానికి ఇపుడు వరసపెట్టి క్యూ కడుతున్నారు.

వైసీపీ పాలనలో విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ ఎక్కువైంది.  ఏ పెట్టుబడి వచ్చినా విశాఖకే  తొలి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తోంది. ఆ మధ్యన‌ ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ టైర్ల కంపెనీ పెట్టడానికి వస్తే విశాఖలోనే పెట్టాలని ప్రభుత్వం సూచించింది.  త్వరలోనే అది మొదలవుతోంది.

ఇక ఇపుడు తాజాగా  జపనీస్ ఎన్ క్లేవ్ ని విశాఖలో ఏర్పాటుచేస్తున్నారు. జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కి దీని ద్వారా శ్రీకారం చుడుతున్నారు. ఏకంగా పది లక్షల చదరపు అడుగులలో ఏర్పాటు అయ్యే జపనీస్ ఎన్ క్లేవ్ వల్ల వేలమందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంటున్నారు.

ఇంతే కాదు విశాఖ నుంచి చెన్నై కారిడార్ లో మొదటి దశగా విశాఖ కారిడార్ పనులు చురుకుగా సాగుతున్నాయి. మరో వైపు చూసుకుంటే భూమి వరల్డ్‌ సంస్థ  విశాఖపట్నం జిల్లా ఆనందపురం, పద్మనాభం మండలాలలో ఇండిస్టియల్‌ పార్కులను ఏర్పాటుచేయడానికి ముందుకు రావడం కూడా శుభ పరిణామమే. 

మొత్తానికి విశాఖను పారిశ్రామిక కారిడార్ గా మలచేందుకు ఏపీ సర్కార్ సీరియస్ గానే అడుగులు వేస్తోంది. వీటి ఫలితాలు కనుక వస్తే విశాఖ స్వరూపమే మారిపోతుందని అంటున్నారు.

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో బాబును ఓడిస్తారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?