cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

యువ ఐఏఎస్ జంట విడాకుల బాట‌

యువ ఐఏఎస్ జంట విడాకుల బాట‌

యువ ఐఏఎస్ జంట మ‌ధ్య మ‌తం చిచ్చు పెట్టింద‌నే వాద‌న‌కు బ‌లం క‌లుగుతోంది. ఆ జంట విడాకుల బాట ప‌ట్ట‌డంతో ఇంత కాలం ర‌క‌ర‌కాలుగా వినిపిస్తున్న వాద‌న‌ల్లో నిజం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌స్థాన్ కేడ‌ర్‌కు చెందిన ఐఏఎస్ జంట ప‌ట్టుమ‌ని పెళ్లి చేసుకుని రెండేళ్లు కూడా కాకుండానే విడిపోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

అథార్‌ అమీర్‌ఖాన్, టీనా దాబిలు పరస్పర అంగీకారంతో జైపూర్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్పీల్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని  అధికార వర్గాలు ధ్రువీక‌రించాయి.  అయితే వీళ్ల మ‌ధ్య విబేధాలు రావ‌డానికి మ‌తం అడ్డుగోడ‌గా నిలిచింద‌నే వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

లవ్‌ జిహాదీలో భాగంగానే వీరి వివాహం జ‌రిగిన‌ట్టు  హిందూ మహాసభ ఆరోపణలు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టి ఈ ఐఏఎస్‌ జంట విడాకులపై ప‌డింది. 2016వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన  అమీర్‌ఖాన్ క‌శ్మీర్ వాసి. యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో రెండో స్థానం ద‌క్కించుకోగా, అదే బ్యాచ్‌లో టీనాకు మొదటి స్థానం ద‌క్కింది.  

ఐఏఎస్ ట్రైనింగ్‌లో ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ప‌డ్డారు. ట్రైనింగ్ అనంత‌రం ఇద్ద‌రికీ రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లోనే పోస్టింగ్‌లు వచ్చాయి. ప్రేమ కాస్తా పెళ్లికి దారి తీసింది. 2018 మార్చిలో అమీర్, టీనా పెళ్లి చేసుకున్నారు. అనంత‌ర కాలంలో వాళ్ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. సోషల్‌ మీడియా అకౌంట్ల‌లో టీనా తన పేరు చివ‌ర్లోని ఖాన్‌ను తొలగించడంతో వాళ్ల మ‌ధ్య విభేదాలు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం మొద‌లైంది.

ఇదే సంద‌ర్భంలో అమీర్‌ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికల్లో టీనాని అన్‌ఫాలో చేయ‌డంతో వాళ్లిద్ద‌రి మ‌ధ్య సంబంధాల‌పై అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. తాజాగా ఫ్యామిలీ కోర్టులో  విడాకుల కోసం పిటిషన్ వేయ‌డంతో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇటీవ‌ల కాలంలో ల‌వ్ జిహాదీ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న క్ర‌మంలో ఉన్న‌త స్థాయిలో ఉన్న జంట విడిపోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.

బుద్ది లేని రాతలు

 


×