Advertisement

Advertisement


Home > Politics - Political News

సజ్జనార్ ఫోన్ కు 2500 మిస్డ్ కాల్స్!

సజ్జనార్ ఫోన్ కు 2500 మిస్డ్ కాల్స్!

దిశ రేపిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సజ్జనార్ పేరు వార్తల్లో మార్మోగుతూనే ఉంది. ఇక ఆ నలుగురినీ ఎన్ కౌంటర్ చేశాకా అయితే.. సజ్జనార్ పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా చర్చ జరుగుతూనే ఉంది. కన్నడీగుడు అయిన సజ్జనార్ కుటుంబ సభ్యులను అక్కడ కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు!

ఆ సంగతలా ఉంటే.. దిశ రేపిస్టులు నలుగురిని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనకు అనేక మంది నుంచి వరసగా ఫోన్ కాల్స్ వచ్చాయట. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ కోరుతూ ఫోన్లు చేసిన వారే వారిలో అధికం. పోలీసాఫీసర్ కావడంతో ఆయన ఫోన్ నంబర్ అనేక మందికి త్వరగా పాకిపోయింది.

అలా వారంతా ఆయనకు కాల్స్ చేశారని, ఒక దశలో కాల్స్ రిసీవ్ చేసుకోవడం ఆపేసిందట ఈ పోలీసాఫీసర్ కుటుంబం. దీంతో రెండు వేల ఐదు వందల మిస్డ్ కాల్స్ నమోదయ్యాయని సమాచారం. సజ్జనార్ భార్యా ఫోన్ కు కూడా ఈ తరహా కాల్స్ వచ్చాయట. కొంతమంది పోలీసాఫీసర్ల భార్యలు, పిల్లలు కూడా సజ్జనార్ భార్యకు ఫోన్లు చేసి.. దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేయాలంటూ సూచించినట్టుగా సమాచారం. 

దిశ పై జరిగిన హత్యాచారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకం విషయంలో ప్రజలే రోడ్డుకు ఎక్కారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇలా కొన్ని వేల ఫోన్ కాల్స్.. పోలీసాఫీసర్ల మీద సహజంగానే ఒత్తిడిని పెంచుతాయి. గతంలో నిర్భయపై జరిగిన ఘాతుకానికి సంబంధించిన కేసును డీల్ చేసిన పోలీపాఫీసర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నిందితులు దొరికినప్పటి నుంచి తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. అయితే తను చట్టాన్ని అతిక్రమించలేదని ఆయన వ్యాఖ్యానించారు.   

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?