cloudfront

Advertisement


Home > Politics - Political News

3 పార్టీలు.. 3 ప్రకటనలు.. నిర్ణయం మీదే

3 పార్టీలు.. 3 ప్రకటనలు.. నిర్ణయం మీదే

మాయావతిని పీఎంగా చూడాలని ఉంది - పవన్
రాహుల్ ను ప్రధానిని చేస్తా - చంద్రబాబు
ప్రత్యేకహోదా ఎవరిస్తే వాళ్లే ప్రధాని - జగన్

ఈ మూడు ప్రకటనలు చూస్తే ఏ పార్టీకి ఓటేయాలో ఆంధ్రా ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవి కూడా అప్పుడెప్పుడో ఇచ్చిన స్టేట్ మెంట్స్ కావు. రీసెంట్ గా మూడుపార్టీల అధినేతలు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఇవి. తాజాగా ఉత్తరప్రదేశ్ వెళ్లి మరీ మాయావతితో పొత్తు పెట్టుకొని వచ్చారు పవన్. బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన పవన్, మాయావతిని ప్రైమ్ మినిస్టర్ గా చూడాలని ఉందంటూ ప్రకటించారు. నిజానికి మాయావతిపై ఎన్ని అవినీతి కేసులున్నాయో అందరికీ తెలిసిన విషయమే.

ఇక చంద్రబాబు విషయానికొద్దాం. గత ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధానిని చేయడం దేశానికి అత్యవసరం అన్నారు బాబు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సోనియా నుంచి దేశానికి విముక్తి కోసం మోడీని గెలిపించాలన్నారు. సరిగ్గా ఈ ఎన్నికల సమయానికి బాబు నాలిక మడత పడిపోయింది. అప్పుడు మోడీని గెలిపించడం అత్యవసరం అన్న చంద్రబాబు, ఇప్పుడు అదే నాలుకతో రాహుల్ ను గెలిపించడం ధర్మం అంటున్నారు.

అప్పుడు ఏ కాంగ్రెస్ నైతే ఓడించి దేశానికి విముక్తి ప్రసాదించాలని కోరారో, ఇప్పుడు అదే కాంగ్రెస్ గెలవడం ప్రజాస్వామ్య పరిరక్షణ కింద లెక్క అంటున్నారు. ఇలా ప్రతి ఎన్నికలకు ఓ పార్టీతో అంటకాగడం చంద్రబాబు ప్రత్యేకత. ఈ మొత్తం వ్యవహారంలో మాట మీద నిలబడిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే. గడిచిన ఐదేళ్ల నుంచి జగన్ ది ఒకటేమాట, ఒకటేబాట. ప్రత్యేకహోదా అంశమే ప్రధాన అజెండా. ప్రజాపక్షమే ఆయన బాట.

ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తారో వాళ్లకే భేషరతుగా మద్దతిస్తామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. అది ఏ పార్టీ అయినా కావొచ్చు, చివరికి సంకీర్ణమైనా తమకు అభ్యంతరం లేదని, ప్రత్యేకహోదా ఇచ్చిన ప్రభుత్వానికే మద్దతిస్తామని తెలిపారు. ఆ అభ్యర్థినే ప్రధానిగా సమర్థిస్తామని ప్రకటించారు.

ప్రత్యేకహోదా అంశాన్ని మధ్యలోనే గాలికొదిలేసిన పవన్ కావాలా... హోదా అంశంపై ఐదేళ్లలో వంద సార్లు మాటమార్చిన యూటర్న్ బాబు కావాలా.. ఐదేళ్లుగా ప్రత్యేక హోదాపై ఒకేమాట మీద నిలబడిన జగన్ రావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాల్సిన టైమ్ వచ్చింది.

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?