Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్న బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై వేటుపడింది. స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించారు. సభా కార్యకలాపాలకు వారు అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.

ఈ సెషన్స్ ముగిసే వరకూ వారిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని స్పీకర్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై తెలుగుదేశం పార్టీ నేతలు చర్చకు పట్టుపట్టారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తను ప్రసంగిస్తున్న వీడియోలను ప్రదర్శింపజేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు నినాదాలు మొదలుపెట్టారు. పోడియం వద్దకు దూసుకెళ్లారు.

స్పీకర్ వారించినా వారు వినలేదు, స్పీకర్ మైకును కూడా విరగొట్ట ప్రయత్నించారు. దీంతో చేసేదిలేక వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటువేశారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున బాగా గోలచేస్తూ కనిపించిన ముగ్గురు ఎమ్మెల్యేలు వీరే. సభలో వీరే కాస్త గట్టిగా మాట్లాడేవారు. అది శ్రుతి మించడంతో ఇలా సస్పెన్షన్ వేటుపడింది.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?