cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనా కల్లోలం.. సింహాలకూ తప్పని ముప్పు

కరోనా కల్లోలం.. సింహాలకూ తప్పని ముప్పు

దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్.. జంతువుల్ని కూడా వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో సింహాలకు కరోనా సోకింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 8 సింహాలకు కరోనా పాజిటివ్ తేలడంతో తీవ్ర కలకలం రేగుతోంది.

సెకెండ్ వేవ్ లో జంతువులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఆ హెచ్చరికల్ని నిజం చేస్తూ, జూ పార్క్ లో సింహాలు కరోనా బారిన పడ్డాయి. మరింత కచ్చితత్వం కోసం సింహాల శాంపిల్స్ ను సీసీఎంబీకి పంపించారు.

గతేడాది కరోనా సమయంలో జంతువులకు కూడా కరోనా సోకినట్టు అక్కడక్కడ వార్తలొచ్చాయి. కానీ మనుషుల్లో వ్యాపించినంత వేగంగా జంతువుల్లో కరోనా విస్తరించలేదు. దీంతో గతేడాది పెద్దగా కేసులు నమోదవ్వలేదు. అయితే సెకండ్ వేవ్ లో మాత్రం జంతువులకు కూడా వ్యాపించే విధంగా కరోనా జన్యువులో మార్పులు జరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

దేశవ్యాప్తంగా జూ పార్కులు మూసేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి హైదరాబాద్ జూకు కూడా సందర్శకుల్ని అనుమతించడం లేదు. అంతలోనే ఇలా 8 ఆసియా సింహాలు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×