cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆ రిస్క్‌ చేయనంటున్న పవన్‌కళ్యాణ్‌.!

ఆ రిస్క్‌ చేయనంటున్న పవన్‌కళ్యాణ్‌.!

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, తెలంగాణ ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు మొన్నామధ్య జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన బయటకు వచ్చింది. ఎన్నికలపై కాదు, ఎన్నికల పొత్తులపై కొంత చర్చ జరిగిన మాట వాస్తవం. ఎన్నికలేంటి.? ఎన్నికల పొత్తులేంటి.? అంటే, అక్కడే వుంది అసలు మతలబు. జనసేన పార్టీకి తెలంగాణలో పోటీచేసే ఉద్దేశ్యం వున్నట్లు కన్పించడంలేదు. ఆ ఉద్దేశ్యమే వుంటే, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్నే రాజకీయంగా పవన్‌ తనకు అనుకూలంగా మార్చుకుని వుండేవారు. 

'నా దగ్గర అన్ని డబ్బుల్లేవ్‌..' అని గ్రేటర్‌ ఎన్నికలపై పవన్‌, కామెడీగా ఓ డైలాగ్‌ పేల్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? మరి, 2019 ఎన్నికలు పవన్‌ ఎలా సిద్ధమవుతున్నారు.. అంటే, అది వేరేసంగతి. తెలంగాణ అంటే పవన్‌కి ప్రత్యేకమైన అభిమానం. గతంలో టీఆర్‌ఎస్‌ని విమర్శించినా, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోని 'తెలంగాణ' పవన్‌కి ఇంకా బాగా నచ్చేసినట్లుంది.. ఆ మధ్య, కేసీఆర్‌తో సమావేశమయి, ఆయన్ని అభినందించేశారు.

ప్రభుత్వ నిర్ణయాలు అద్భుతమంటూ కొనియాడేశారు. ఆ తర్వాత కొండగట్టు నుంచి యాత్ర షురూ చేసిన పవన్‌, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో ఎక్కడా కన్పించిన దాఖలాల్లేవు. అంటే, రాజకీయంగా అన్నమాట. ఈ మధ్య వామపక్షాలు, జనసేన పట్ల ఒకింత ఆకర్షణ పెంచుకున్నట్లే కన్పిస్తోంది వ్యవహారం. అయితే పవన్‌ మాత్రం, వారికి ఎలాంటి హామీ ఇవ్వడంలేదు తెలంగాణకు సంబంధించి.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే పెద్దగా ఇబ్బందుల్లేవు.. పవన్‌కళ్యాణ్‌, వామపక్షాలకు మద్దతివ్వడానికి. 'పవన్‌కళ్యాణ్‌ ఎందుకో తెలంగాణలో పోటీ విషయమై ఆసక్తి చూపడంలేదు..' అని అసలు విషయాన్ని 'ఎర్రదండు' ఆఫ్‌ ది రికార్డ్‌గా బయటపెట్టేసింది. తమ్మినేని వీరభద్రం లాంటి నేతల నుంచే ఈ తరహా వ్యాఖ్యలొస్తున్నాయి.

'కేసీఆర్‌తో విభేదించడానికి పవన్‌కళ్యాణ్‌ సిద్ధంగాలేరు..' అన్నది వామపక్షాల నుంచి, జనసేన విషయమై వస్తున్న మాట. వామపక్షాలంటే జనసేనకు దగ్గరే.. వామపక్షాలతో కలిసి పనిచేయడానికీ జనసేన సిద్ధమే.. కానీ, అందుకోసం కేసీఆర్‌తో విభేదించడమంటే పవన్‌కళ్యాణ్‌ ఇష్టపడ్డంలేదు. ఒకప్పుడు కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన పవన్‌లో ఇంత మార్పు ఎలా వచ్చిందట.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.