cloudfront

Advertisement


Home > Politics - Political News

ప్రకాష్ రాజ్ కు మరో పార్టీ మద్దతు!

ప్రకాష్ రాజ్ కు మరో పార్టీ మద్దతు!

ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించిన ప్రకాష్ రాజ్ కు పార్టీల మద్దతు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆల్ ద బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించాడు. ముందుగా నియోజకవర్గం విషయం సస్పెన్స్ అని చెప్పి.. అది బెంగళూరు సెంట్రల్ అని ప్రకటించాడు ఈ కన్నడీగ.

బెంగళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఇతడు ప్రకటించాడు. ఈయన ఇండిపెండెంట్ గా పోటీచేసినా తాము మద్దతును ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ప్రకాష్ రాజ్ తమ పార్టీలోకి చేరాలని తాము పిలవడం లేదని.. ఆయన ఇండిపెండెంట్ గా నిలిచినా హ్యాపీనే అని ఆప్ ప్రకటించింది. 

ప్రకాష్ రాజ్ లాంటివాళ్లు లోక్ సభ లోకి ప్రవేశించి వాయిస్ వినిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అంటున్నాడు. ఇలా రెండుపార్టీల మద్దతును పొందాడు ఈ నటుడు. బెంగళూరు సెంట్రల్ లో ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఉన్నాడు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద మంచి మెజారిటీ పొంది బీజేపీ అభ్యర్థి నెగ్గాడు. ఇండిపెండెంట్ గా ఏమోకానీ.. కాంగ్రెస్ తరఫు నుంచి ప్రకాష్ రాజ్ పోటీచేస్తే.. గట్టిపోటీనే ఇవ్వగలడు. బీజేపీ వ్యతిరేకి అయిన ఈ నటుడు.. ఢిల్లీ వెళ్లి వివిధ అంశాల్లో కాంగ్రెస్ ను సమర్థిస్తూ ఉన్నాడు. చివరకు కాంగ్రెస్ టికెట్ మీదే బరిలో దిగుతాడేమో చూడాలి!

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?