cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏసీబీ వ‌ద్దు ... సీబీఐ ముద్దు

ఏసీబీ వ‌ద్దు ... సీబీఐ ముద్దు

ప్ర‌తిప‌క్షం ఏదైనా రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై న‌మ్మ‌కం ఉండ‌దు. గ‌తంలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై న‌మ్మ‌కం లేద‌ని ప‌దేప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. అంతెందుకు త‌నపై విశాఖ విమానాశ్ర‌యంలో కోడిక‌త్తితో దాడి ఘ‌ట‌న కావ‌చ్చు, 

త‌న సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న‌పై బాబు పాల‌న‌లోని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై న‌మ్మ‌కం లేద‌ని నాటి ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలి సిందే. కేంద్రప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని జ‌గ‌న్ గ‌ట్టిగా డిమాండ్ చేసిన విశారు. కానీ ముఖ్యమంత్రిగా అస‌లు త‌న రాష్ట్రంలోకి సీబీఐ వ‌చ్చేందుకు చంద్ర‌బాబు ఎంత మాత్రం అంగీక‌రించ‌లేదు. తాను ఎట్టి ప‌రిస్థి తుల్లోనూ ఏపీలోకి సీబీఐని అడుగు పెట్ట‌నివ్వ‌న‌ని చంద్ర‌బాబు ఓ జీవోను కూడా తీసుకురావ‌డాన్ని ఎవ‌రూ మ‌రిచిపోలేదు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా రాజ‌కీయ ప‌రిణామాల‌ను మార్చి వేశాయి. ప్ర‌తిప‌క్షం పాల‌క‌ప‌క్షంగా, పాల‌క ప‌క్షం ప్ర‌తిప‌క్ష స్థానాల్లోకి వ‌చ్చాయి. దీంతో టీడీపీకి జ‌గ‌న్ సార‌థ్యంలోని ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై ఏ మాత్రం న‌మ్మ‌కం లేక పోవ‌డం స‌హ‌జంగానే ఏ మాత్రం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌డం లేదు. పాల‌క ప‌క్ష వైసీపీకి మాత్రం కొన్ని సంద‌ర్భాల్లో సీబీఐ అంటే బాగా ఇష్టంగా, మ‌రికొన్ని స‌మ‌యాల్లో అయిష్టంగా ఉంటోంది.

ప్ర‌స్తుతానికి వ‌స్తే అమ‌రావ‌తి రాజ‌ధాని కుంభ‌కోణంపై స‌మ‌గ్ర విచార‌ణలో భాగంగా  మంగ‌ళ‌వారం ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఏసీబీ అనేది రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ద‌ర్యాప్తు సంస్థ‌. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌ల‌పై ప్రాథ‌మిక నివేదిక‌ల ఆధారంగా ఏసీబీ కేసు న‌మోదు చేసింది.

రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాల కొనుగోలు చేశారు. అందులో 900 ఎకరాల అసైన్డ్‌ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు నిర్ధార‌ణ అయింది.  అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై అభియోగాలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాం శ‌మైం ది.  ఈ కుంభకోణంలో  శ్రీనివాస్‌తో పాటు మరో 12 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. తనను అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టులో దమ్మాలపాటి సోమ‌వారం ముందస్తు పిటిషన్ వేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ఎటూ ఏసీబీపై న‌మ్మ‌కం లేదు కాబ‌ట్టి .... కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తే బాగుం టుంద‌నే బ‌ల‌మైన వాద‌న వినిపిస్తోంది. ఏసీబీ ఎంత నిష్ప‌క్ష‌పాతంగా, నిజాయితీగా విచార‌ణ జ‌రిపినా ....ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం ఖాయం. అందువ‌ల్ల సీబీఐకి అప్ప‌గించాల‌ని త‌న‌కు తాను కోర‌డం వ‌ల్ల టీడీపీకి ఎంతో లాభించే అవ‌కాశం ఉంది.

ఎందుకంటే ఈ డిమాండ్‌తో రాజ‌ధానిలో ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌లేద‌నే సందేశాన్ని, సంకేతాల్ని జ‌నంలోకి తీసుకెళ్లే అవ‌కాశం టీడీపీకి ద‌క్కుతుంది. అందులోనూ ఇటీవ‌ల కాలంలో సీబీఐ అంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ఎంతో ఇష్టం కూడా. డాక్ట‌ర్ సుధాక‌ర్‌కు సంబంధించి టీడీపీ పిటిష‌న్ వ‌ల్లే హైకోర్టు సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన విష‌యం తెలిసిందే. 

డాక్ట‌ర్ సుధాక‌ర్ లాంటి కేసే సీబీఐకి వెళ్లిన‌ప్పుడు ... అమ‌రావ‌తి లాంటి భారీ కుంభ‌కోణంలో క‌డిగిన ముత్యంలా టీడీపీ బ‌య‌ట‌ప‌డితే రాజ‌కీయంగా ఎంతో ప్ర‌యోజ‌నం పొందుతుంద‌నే వాళ్లు లేక‌పోలేదు. అందువ‌ల్ల ఏసీబీ వ‌ద్దు ... సీబీఐ ముద్దు అని చంద్ర‌బాబు, లోకేశ్ లాంటి అగ్ర‌నాయ‌కులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మోడీ స‌ర్కార్‌ను కోరాల్సిన అవ‌స‌రం ఉంది.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?

 


×