cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్య‌య్యో....ఇలా చిక్కావేంది అచ్చెన్నా!

అయ్య‌య్యో....ఇలా చిక్కావేంది అచ్చెన్నా!

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఎప్పుడెప్పుడు చిక్కుతారా? అని వైసీపీ సోష‌ల్ మీడియా ఎదురు చూస్తూ వుంటుంది. తాజాగా అచ్చెన్నాయుడు అనుకోని రీతిలో చిక్కాడు. 

అస‌లే హెవీ బాడీ కావ‌డంతో ఆయ‌న దెబ్బ‌కు సోఫా కూడా విరిగిపోయింది. దీంతో తన‌తో పాటు అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు కూడా వెన‌క్కి ప‌డిపోవాల్సి వ‌చ్చింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు బాబాయ్‌, అబ్బాయ్‌ల‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గలేదు. ప్ర‌మాద‌మ‌ల్లా సోఫాకే. అస‌లేం జ‌రిగిందంటే...

శ్రీ‌కాకుళంలో స‌ర్దార్  గౌతు ల‌చ్చ‌న్న పోస్ట‌ల్ క‌వ‌ర్ ఆవిష్క‌ర‌ణ స‌భ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, అచ్చెన్నాయుడు త‌దిత‌రులు ముఖ్య అతిథులు. స‌భ ప్రారంభ‌మైంది. ఒక్కొక్క‌రిని వేదిక‌పైకి నిర్వాహ‌కులు ఆహ్వానిస్తున్నారు. రామ్మోహ‌న్‌నాయుడు అప్ప‌టికే వేదిక‌పైకి వ‌చ్చి సోఫాపై ఆసీనుల‌య్యారు. ఆ త‌ర్వాత అచ్చెన్నాయుడు వేదిక‌పైకి వెళ్లారు.

ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు ప‌క్క‌నే సోఫాలో అసీనుల‌య్యారు. అయితే ఆ వెయిట్‌కు త‌ట్టుకోలేక సోఫా ఠ‌పీమంది. దీంతో బాబాయ్‌, అబ్బాయ్‌లిద్ద‌రూ కూచున్న వాళ్లు కూచున్న‌ట్టే వెన‌క్కి ప‌డిపోయారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీ శ్రేణులు ఆందోళ‌న చెందాయి. వాళ్లిద్ద‌రినీ నిర్వాహ‌కులు పైకి లేపారు. 

ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో నిర్వాహ‌కులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వైసీపీ సోష‌ల్ మీడియా మాత్రం అచ్చెన్న హెవీ బాడీతో సోఫా సీటుకు ప్ర‌మాదం జ‌రిగింద‌ని సెటైర్లు విసర‌డం గ‌మ‌నార్హం.

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×