Advertisement

Advertisement


Home > Politics - Political News

అప్పుడు షూటింగ్ వాయిదా..ఇప్పుడు రిలీజ్ వాయిదా

అప్పుడు షూటింగ్ వాయిదా..ఇప్పుడు రిలీజ్ వాయిదా

ఏడాది కిందట కరోనా విజృంభిస్తున్న కొత్తలో ముందుజాగ్రత్త చర్యగా, అందరికంటే ముందు తన సినిమా షూటింగ్ ను నిలిపివేశారు చిరంజీవి. అలా కరోనాతో ఆగిపోయిన తొలి పెద్ద సినిమాగా నిలిచింది ఆచార్య. ఇప్పుడు సెకెండ్ వేవ్ ప్రభావం కూడా ఈ సినిమాపై పడింది. సెకెండ్ వేవ్ లో కరోనా వల్ల వాయిదా పడుతున్న పెద్ద సినిమాగా కూడా నిలిచింది ఆచార్య.

అవును.. వచ్చే నెల రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య సినిమా చెప్పిన తేదీకి రావడం లేదు. ఈ సినిమాను మే నెలలో కాకుండా, జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ మూడో వారంలో ఆచార్య రిలీజ్ అవుతుంది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను ఈ నెలాఖరుకు పూర్తిచేయాల్సిందిగా యూనిట్ కు చెప్పారు చిరంజీవి. కేసులు మరింత పెరిగితే షూటింగ్ కు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి.. వీలైనంత తొందరగా బ్యాలెన్స్ షూట్ పూర్తిచేయాలని కొరటాలకు చెప్పారు.

అటు కొరటాల కూడా ఆచార్యను వీలైనంత తొందరగా పూర్తిచేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే, ఎన్టీఆర్ తో కలిసి జులై నుంచి సెట్స్ పైకి వెళ్లాలనేది కొరటాల ఆలోచన. మరోవైపు చిరంజీవి కూడా ఇప్పటికే ఆలస్యమైన లూసిఫర్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?