Advertisement

Advertisement


Home > Politics - Political News

అచ్చెన్నా...ముంచావు క‌ద‌య్యా!

అచ్చెన్నా...ముంచావు క‌ద‌య్యా!

తిరుప‌తిలో టీడీపీ డ్రామా అడ్డం తిరిగింది. చంద్ర‌బాబు స‌భ‌పై వైసీపీ రాళ్ల దాడి చేయించింద‌నే డ్రామాను టీడీపీ ర‌క్తి క‌ట్టించ‌లేకపోయింది. అబ‌ద్ధ‌మాడినా అతికిన‌ట్టు ఉండాల‌ని పెద్ద‌లు చెబుతారు. ఆ సూక్ష్మాన్ని టీడీపీ విస్మ‌రించ‌డంతో అస‌లుకే మోసం వ‌చ్చింది. 

రాళ్ల దాడి ఘ‌ట‌న ....ప‌ది ఓట్లు రాల్చుతుంద‌నే టీడీపీ ఎత్తులను ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చిత్తు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తీరా ఎన్నిక‌ల ముంగిట టీడీపీని త‌మ అధ్య‌క్షుడే నిండా ముంచార‌ని ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

కాలం క‌లిసిరాన‌ప్పుడు తాడే పామై క‌రుస్తుంద‌నే నానుడికి ప్ర‌స్తుతం టీడీపీ ద‌య‌నీయ స్థితి అద్దం ప‌డుతోంది. టీడీపీ భావి నాయ‌కుడు నారా లోకేశ్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడిన నిప్పులాంటి నిజాలు నిమిషాల వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. 

అస‌లే లోకేశ్‌, ఆయ‌న‌పై నోరు పారేసుకున్న‌ది ఏ కొడాలి నానో, పేర్ని నానో, వ‌ల్ల‌భ‌నేని వంశీనో ఎంత మాత్రం కాదు. ఆ పార్టీ రాష్ట్ర ర‌థ‌సార‌థి అచ్చెన్నాయుడు కావ‌డంతో ఆ మాట‌ల‌కు ఎన‌లేని విలువ వ‌చ్చేసింది.

దీంతో నిన్న‌రాత్రి రాళ్ల దాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కూ లాగుతూ, ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే టీడీపీ ప్ర‌య‌త్నాలు క‌నీసం 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌నే మ‌రుగున ప‌డ‌డం విషాదం. పైగా లోకేశ్‌పై అచ్చెన్నాయుడి ఘాటు వ్యాఖ్య‌ల‌తో కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చింది.  టీడీపీకి భ‌విష్య‌త్ లేదు, బొక్కా లేదంటూ అచ్చెన్నాయుడే అన‌డంతో... ఇక ఆ పార్టీకి ఓట్లు వేయ‌డం దండ‌గ అనే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

చంద్ర‌బాబును పాపాలు వెంటాడుతున్నాయ‌నే అభిప్రాయాలు ... తాజాగా అచ్చెన్నాయుడి వీడియో వైర‌ల్ అవుతున్న నేప‌థ్యం లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎవ‌రో ఆక‌తాయి చేష్ట‌ల‌ను రాజ‌కీయ స్వార్థానికి వాడుకోవాల‌ని చూసిన చంద్ర‌బాబుకు, క‌లి యుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర్వుడు త‌గిన శాస్తి చెప్పార‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

చేసుకున్న వారికి చేసుకున్నంత మ‌హ‌దేవ అనే చందంగా ...నిన్న రాత్రి రాళ్ల దాడితో వైసీపీకి సంబంధం లేకున్నా, అంట‌గట్టా ల‌నే బాబు కుట్ర‌ల‌కు శిక్ష‌గా నేడు లోకేశ్‌పై అచ్చెన్నాయుడి వీడియో బ‌య‌ట‌ప‌డింద‌నే వాద‌న లేక‌పోలేదు. నిన్న రాత్రి రాళ్ల దాడి ఘ‌ట‌న‌తో పొలిటిక‌ల్‌గా మైలేజ్ వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు స‌హా టీడీపీ నేత‌ల సంబ‌రం ప‌ట్టుమ‌ని ఒక్క‌రోజు కూడా నిల‌వ‌లేదు. 

టీడీపీకి అచ్చే దిన్ తెస్తార‌నుకుంటే, ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థికి ఉప‌యోగ‌ప‌డేలా అచ్చెన్నాయుడి వ్య‌వ‌హారం ఉంద‌నే చ‌ర్చ టీడీపీలో జ‌రుగుతోంది. ఏది ఏమైనా చెడ‌పకురా చెడ‌ద‌వు అంటే ఎలాగో టీడీపీకి ఎదురైన తాజా వీడియో ఘ‌ట‌నే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

-సొదుం ర‌మ‌ణ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?