Advertisement

Advertisement


Home > Politics - Political News

మార్చి తర్వాత చంద్రబాబు సైలెంట్‌ మోడ్‌లోకే.!

మార్చి తర్వాత చంద్రబాబు సైలెంట్‌ మోడ్‌లోకే.!

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికల హామీల్ని పూర్తిస్థాయిలో నెరవేర్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దాదాపుగా విజయం సాధించినట్లే. మార్చి నెలాఖరున పేదలకు ఇళ్ళ పట్టాలు అందించే మహోన్నత కార్యక్రమం జరగబోతోంది.

రాష్ట్ర చరిత్రలోనే ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబోతోంది. గ్రౌండ్‌ లెవల్‌లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నా ఒక్కో సమస్యనీ అధిగమించి లక్ష్యానికి చేరువవుతోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

మరోపక్క, పెద్ద సంఖ్యలో పేదలు ఇళ్ళ స్థలాల కోసం ఎదురుచూస్తున్న దరిమిలా, అవసరమైన భూమి అందుబాటులో లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తోన్న విషయం విదితమే.

ఇళ్ళ పట్టాల పంపిణీ పెద్ద ఫెయిల్యూర్‌ అవ్వాలన్నది టీడీపీ ఆశ. ఆ ఒక్క ఫెయిల్యూర్‌తో జగన్‌ సర్కార్‌ తన ఇమేజ్‌ని కోల్పోతుందని టీడీపీ భావిస్తోంది. మరోపక్క, ప్రతిపక్షానికి ఆ అవకాశమే ఇవ్వకూడదని పట్టుదలతో వున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

‘మార్చి నెలాఖరున.. ఉగాది పర్వదినాన ఇళ్ళ పట్టాల పంపిణీ పెద్ద పండుగలా జరుగుతుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్ళిపోవడం ఖాయం..’ అని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నా, తాజాగా ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారతాయన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట.

పేదల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారనీ.. దళితులకు గతంలో కేటాయించిన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందనీ విపక్షాలు దుష్ప్రచారం చేస్తోన్న దరిమిలా.. అలాంటి సందర్భమే ఎదురైతే మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి నేడు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం గమనార్హం.

ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చినా.. ఇల్లు - ఇంటి స్థలం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలో ఇటు లబ్దిదారులకీ, అటు ప్రభుత్వానికీ ఈ పథకం అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. లబ్దిదారుల్ని పూర్తిస్థాయిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గనుక సంతృప్తిపరచగలిగితే.. ఇక విపక్షంగా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చి తీరుతుందన్నది నిర్వివాదాంశం.

పూజకి నో చాన్స్.. కారణం అదే

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?