cloudfront

Advertisement


Home > Politics - Political News

అక్కడ నవ్వు రత్నాలు..ఇక్కడ నవరత్నాలు

అక్కడ నవ్వు రత్నాలు..ఇక్కడ నవరత్నాలు

పెద్దవాళ్లు తింటే ఫలహారం, చిన్నవాళ్లు తింటే చిరుతిళ్లు అన్నారు వెనకటికి. తెలుగుదేశం అండ్ కో వ్యవహారం అలాగే వుంది. జగన్ తన పాదయాత్ర ప్రారంభించిన తరువాత ఆంధ్ర ప్రజల కోసం నవరత్నాలు అనే స్కీములు ప్రకటించారు. దాన్ని తెలుగుదేశం జనాలు ఎంత ఎద్దేవా చేయాలో అంతా చేసారు. చంద్రబాబు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా ఫరవాలేదు. జగన్ మాత్రం ఇస్తా అని చెప్పకూడదు. 

అందుకే నవరత్నాలకు ఇన్ని కోట్లు కావాలి, అన్ని వందల కోట్లు కావాలి, అని తెలుగుదేశం అను'కుల' మీడియా కథనాలు వండి వార్చింది. సరే, ఆ వైనం అలాగే వుంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్లస్ తెలుగుదేశం కలిసి ఇచ్చిన వాగ్దానాల విలువ అచ్చంగా లక్ష కోట్లకు పైమాటే అని జాతీయ మీడియా వివరంగా వార్తలు అందించింది. 

గవర్నమెంట్ స్కూలులో చదువుకుంటూ వుంటే చాలు నెలకు అయిదు వందలు, రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ, ఇంటి అద్దె కింద యాభై వేలు. పల్లెటూరిలో రెండు మూడు సెంట్లు ఖాళీ జాగా వుంటే చాలు, ఇల్లు కట్టుకునేందుకు అయిదారు లక్షలు. ఇలా ఎన్నో..ఎన్నో.

మరి ఇప్పుడు జగన్ నవరత్నాల టైమ్ లో వండి వార్చిన కథనాలు, చేసిన ఎకసెక్కాలు గుర్తురాలేదు. మరి ఇదే మానిఫెస్టోను జగన్ ఇప్పుడు ఆంధ్రలో ముందుగా ప్రకటిస్తే, బాబు అండ్ కో ఏమని అంటారో?