Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆళ్లగడ్డలో భూమా వారసత్వపోరు

ఆళ్లగడ్డలో భూమా వారసత్వపోరు

తెలుగు రాష్టాల్లో ఆళ్లగడ్డ మరియు భూమా కుటుంబం పరిచయం అక్కర్లేని పేర్లు. నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాలను 35 సంవత్సరాలు శాశించిన కుటుంబం. కానీ ఇప్పుడు వారసత్వ పోరుతో సతమతవుతోంది. తల్లి చనిపోతూనే ఎమ్మెల్యే పదవి తండ్రి చనిపోతూనే మంత్రిపదవి రావడంతో అఖిలప్రియకు ఆళ్లగడ్డ వర్గ రాజకీయం ఒంటపట్టలేదు. ఆళ్లగడ్డలో పార్టీలతో నిమిత్తం లేకుండా వర్గాలమీద రాజకీయాలు నడుస్తాయి. దశాబ్ధాల నుంచి ఇక్కడ భూమా, గంగుల కుటుంబాల మధ్యే రాజకీయపోరు నడుస్తోంది.

ఎక్కువ సంవత్సరాలు భూమా కుటుంబం నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీనికి కారణం బంధువర్గం బలమైన నాయకత్వం. ఇక్కడి ప్రజలు తమ నాయకుడి ప్రవర్తన వ్యక్తిగత గుణగణాలను కూడా పరిగణంలోకి తీసుకుంటారు. చిన్నవయసులోనే పదవులు రావడం అనుభవలేమితో అఖిలప్రియ తన దగ్గరివారిని బంధువులను అందరినీ దూరంచేసుకుంది. ఇంతవరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న భూమానాగిరెడ్డి అన్నదమ్ముల కుటుంబం ఇప్పుడు వేరుపడ్డారు.

అఖిలప్రియ సోదరుడు భూమానాగిరెడ్డి అన్న కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్‌ నాయుడు తీరునచ్చక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎక్కువశాతం బంధువర్గం అనుచరవర్గం భూమా కిశోర్‌రెడ్డి వెంట నడిచారు. దీనికితోడు భూమా కిశోర్‌రెడ్డి కొన్నిమాసాలుగా గ్రామాల్లో పర్యటిస్తూ గత ఎన్నికల్లో దూరమైన వర్గాన్ని బంధువులని మళ్ళీ ఒక్కత్రాటిపైకి తెస్తూ 2024 ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తవుతున్నాడు. దీనితో అఖిలప్రియ ఎలాగైనా భూమావర్గాన్ని తనవైపు రాబట్టాలని తప్పుమీద తప్పులు చేస్తున్నారు.

అందులో భాగమే భూమా కిశోర్‌రెడ్డికి మద్ధతు తెలిపిన భూమా కుటుంబం దగ్గర బంధువైన శివరామిరెడ్డి క్రషర్‌ను అఖిలప్రియ భర్త బలవంతంగా ఆక్రమించాలని ప్రయత్నించడం. ఇలాంటి చేష్టలతో బంధువర్గం అనుచరవర్గం అఖిలప్రియకు మరింత దూరమౌతున్నారు. అనుచరవర్గం భూమా కిశోర్‌రెడ్డి కూడా ఆ కుటుంబం వారసుడేకదా.. అయన తండ్రి భూమా భాస్కరరెడ్డి మరణించిన తరువాత భూమా నాగిరెడ్డి రాజకీయ అరంగేట్రం చేసాడుకదా.. మరి ఇప్పుడు తాము భూమా కిశోర్‌రెడ్డి వెంటనడిస్తే తప్పు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

భూమా దంపతులు బ్రతికి ఉన్నకాలంలో భూమా కిశోర్‌రెడ్డి ఆళ్లగడ్డ మండలాధ్యక్షుడిగా ఆళ్లగడ్డ రాజకీయాల్లో చురుకుగా పనిచేసారు. భూమా దంపతులు కూడా తమ అన్నదమ్ముల పిల్లలను తమపిల్లల్లాగే సమానంగా చూసారు. భూమా నాగిరెడ్డి కుమారుడికి వచ్చే ఎన్నికలకు వయసు తక్కువ కావడంతో అనుచరవర్గం బంధువర్గం భూమా కిశోర్‌రెడ్డి భూమా వారసుడిగా వస్తే తప్పు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అఖిలప్రియను ఆమె భర్త నాయకత్వాన్ని ఒప్పుకోమని తెగేసి చెప్తున్నారు.

అఖిలప్రియ భర్త వ్యవహారం నచ్చని ఆమె మరో సోదరుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఆళ్లగడ్డ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. చూడాలి అన్న చెల్లెలులో ఎవరు భూమా రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారో.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?