Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో అన‌సూయ‌...అంత అన్యాయం జ‌రిగిందా?

అయ్యో అన‌సూయ‌...అంత అన్యాయం జ‌రిగిందా?

వెండితెర రంగ‌మ్మ‌త్త‌గా బుల్లితెర యాంక‌ర్‌, న‌టి అన‌సూయ అంద‌రికీ సుప‌రిచ‌య‌స్తురాలు. సోష‌ల్ మీడియాలో ఆమె చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సామాజిక అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తుంటారు. అలాగే త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త అంశాల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ అల‌రిస్తుంటారు.

తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ను మీడియాతో పంచుకున్నారు.కోవిడ్ స‌మ‌యంలో నాలుగు పెద్ద సినిమాల్లో న‌టించే అవ‌కాశాన్ని పోగొట్టుకున్న‌ట్టు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణం కంటికి క‌నిపించ‌ని ఫేవ‌రెట‌జం కార‌ణ‌మ‌ని ఆమె చెప్పుకొచ్చారు.  

ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. 2020 ఏడాదిని త‌ల‌చుకుంటే కొన్నిసార్లు భ‌య‌మేస్తుంద‌ని, అలాగే మ‌రికొన్నిసార్లు చాలా నేర్చుకున్నామ‌నే భావ‌న క‌లుగుతుంద‌ని ఆమె అన్నారు. కోవిడ్ వ‌ల్ల ఎవ‌రూ బ‌య‌ట‌కు అడుగు పెట్టే ప‌రిస్థితి లేక‌పోయింద‌న్నారు.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో బ‌య‌టికి క‌నిపించ‌ని ఫేవ‌రెటిజం చాలా ఉంద‌ని అన‌సూయ చెప్పారు. షూటింగ్ త‌ర్వాతే అస‌లు క‌థ న‌డుస్తుంద‌న్నారు. సినిమా విడుద‌లై, అందులో మ‌నం క‌నిపించేంత వ‌ర‌కూ ఆందోళ‌న ఉంటుంద‌న్నారు. 

చాలా సంద‌ర్భాల్లో పాత్ర‌లు చేతికి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోతుంటాయ‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఇందుకు త‌న అనుభ‌వాన్నే ఉదాహ‌ర‌ణ‌గా అన‌సూయ తెలిపారు. కోవిడ్ స‌మ‌యంలో తాను నాలుగు పెద్ద సినిమాల్లో న‌టించే అవ‌కాశాన్ని కోల్పోయిన‌ట్టు అన‌సూయ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పోనీ ఆ పాత్రలు చేసిన వాళ్లు త‌న‌కంటే కన్నా గొప్పగా నటించేవారా? అంటే, కానే కాద‌ని అన‌సూయ తెలిపారు. అయినా వాళ్ల‌కే  అవకాశం  దక్కింద‌న్నారు.  ఇలాంటి సంఘటనలు గ‌తంలోనైతే  చాలా బాధపడేదాన్న‌ని ఆమె చెప్పారు. ఇప్పుడు పెద్దగా బాధపడటం లేదని అన‌సూయ తెలిపారు.

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండ‌డం గురించి కూడా ఆమె వివ‌రించారు. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్స్ త‌న‌పై వ‌స్తూ ఉంటాయ‌న్నారు. ఈ కామెంట్స్‌పై మొద‌ట్లో చాలా సీరియ‌స్ అయ్యేదాన్న‌న‌న్నారు. 

గతంలో మ‌న‌సులో ఏమున్నా వెంట‌నే బ‌య‌టికి వెళ్ల‌గ‌క్కేదాన్న‌న‌న్నారు. అందువ‌ల్లే త‌న‌ను వివాదాలు చుట్టుముట్టేవ‌ని ఆమె తెలిపారు. ముక్కుసూటిగా మాట్లాడ్డ‌మే తాను వివాదాల్లో చిక్కుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా ఆమె చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల ఈ విష‌య‌మై క్లారిటీ వ‌చ్చింద‌న్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌పై స్పందించ‌డం పూర్తిగా మానేసిన‌ట్టు అన‌సూయ తెలిపారు. ఎందుకంటే ప్ర‌తి వ్య‌క్తికి ఒక్కో అభిప్రాయం ఉంటుంద‌న్నారు. వాట‌న్నింటిపై స్పందిస్తూ స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌డ‌మే అని భావించి ....స్పందించ‌డం మానేసిన‌ట్టు అన‌సూయ చెప్పుకొచ్చారు.  మనకు మన మనస్సే  మనస్సాక్షి అని తెలిపారు.

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచించక తప్పని పరిస్థితి

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?