cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

క్రెడిట్ అంతా లోకేష్ దే...అచ్చెన్న సైలెంట్... ?

క్రెడిట్ అంతా లోకేష్ దే...అచ్చెన్న సైలెంట్... ?

తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు హిట్ అంటున్నారుట. ఇంతకీ హిట్ అయ్యే పని చినబాబు ఏం చేశాడూ అంటే టెన్త్ ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారట. దాంతో జగన్ సర్కార్ దిగివచ్చి ఆ పని చేసింది కాబట్టి విపక్ష నేతగా చినబాబు సూపర్ హిట్ అని అంటున్నారు ఆయన టీమ్.

అదే సమయంలో ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు పాత్ర ఏమీ లేదని కూడా తేల్చేస్తున్నారు. జగన్ సర్కార్ మీద ప్రజా సమస్యల పోరాటంలో అచ్చెన్న వెనకబడ్డారు అని చెప్పడమే దీని ఉద్దేశ్యమని కూడా ఆ పార్టీలో ప్రచారం అయితే సాగుతోందిట.

మరి ఈ మధ్యనే తిరుపతిలో అచ్చెన్నాయుడు లోకేష్ మీద చేసిన వీడియో కామెంట్స్ ప్రభావమో మరేమో కానీ అచ్చెన్న సైలెంట్ గా ఉంటున్నారా అన్నది మరో చర్చగా ఉందిట. ఇక అచ్చెన్నాయుడు కూడా ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ ప్రకటనలు చేశారు. 

విశాఖలో కెఎ పాల్ అయితే దీక్షలు కూడా చేశారు కానీ లోకేష్ మాత్రం ఈ మొత్తం క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలా అచ్చెన్న కంటే తానే ఎక్కువ అని చూపించుకునే ప్రయత్నమా అన్న చర్చ అయితే పసుపు పార్టీలో ఉందిట‌.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×