cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పొత్తులు.. సీట్ల సంఖ్యలు తేలుతున్నాయ్!

పొత్తులు.. సీట్ల సంఖ్యలు తేలుతున్నాయ్!

లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడునెలలు అయిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు మరో ఎన్నికకు తెరలేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతూ ఉంది. ఇప్పటికే పార్టీలు అక్కడ పొత్తుల ప్రయత్నాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో సింగిల్ గా పోటీ చేయడానికి ఏ పార్టీ కూడా అంత రెడీగా లేదు. పొత్తులతోనే అవి బరిలోకి దిగుతూ ఉంటాయి. ఈ క్రమంలో తమ తమ సహజమైన మిత్రులతో ఆ పార్టీలు చేతులు కలుపుతూ ఉన్నాయి.

శివసేన- బీజేపీలు ఒక జట్టుగా, కాంగ్రెస్-ఎన్సీపీలు మరో జట్టుగా పోటీచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సీట్ల సంఖ్యలపై చర్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్-ఎన్సీపీలు ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా ఉన్నాయి. ఆ పార్టీలు చెరో 125 సీట్లలో పోటీ చేయాలని, మిగిలిన సీట్లను ఇతర ఫ్రెండ్లీ పార్టీలకు ఇవ్వాలని నిర్ణయించున్నాయట. ఈ మేరకు శరద్ పవార్ ఒక ప్రకటన చేశారు.

288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో.. తమకు సగం వాటా కావాలని అంటూ బీజేపీని డిమాండ్ చేస్తూ ఉంది శివసేన. ఈ రెండు పార్టీలూ మిత్రపక్షాలుగానే ఉన్నా.. అడపాదడపా కొట్లాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో తమకు కనీసం సగం సీట్లను ఇవ్వకపోతే కూటమి ఉండదని శివసేన హెచ్చరిస్తోందట.

సేనకు ఇలాంటి హెచ్చరికలు కొత్తవి కావు. అయితే బీజేపీ వాళ్లు శివసేనకు 125 సీట్ల వరకూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. శివసేన డిమాండ్ సగం సీట్ల వరకూ ఉంది. ఈ రెండు పార్టీలూ చివరకు అయితే ఒక ఒప్పందానికి రావడం మాత్రం ఖాయమే.

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!