cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏమండోయ్ నాని గారు ...క్ష‌మాప‌ణ చెప్పించండి

ఏమండోయ్ నాని గారు ...క్ష‌మాప‌ణ చెప్పించండి

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ఒక స్థిర‌మైన రాజ‌కీయ అభిప్రాయం లేదు. అధికారంలో ఉంటే ఒక‌లా, ప్ర‌తిప‌క్షంలో ఉంటే మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌డం ఆ పార్టీ సిద్ధాంత‌మైంది. అవ‌స‌రాలు, అవ‌కాశ‌వాదం ప్రాతిప‌దిక‌గా రాజ‌కీయ అడుగులు వేస్తున్న‌ట్టు ...ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు మొద‌లుకుని, మిగిలిన నేత‌ల మాట‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ పార్టీ రోజురోజుకూ ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌నవుతోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌టికొచ్చింది. కాంగ్రెస్‌తో చేతులు క‌లిపింది. తెలంగాణ‌లో ఏడాది ముందే కేసీఆర్ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డంతో 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. 

బాబు, రాహుల్ చెట్ట‌ప‌ట్టాల్ అనే రీతిలో తిరిగారు. తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్‌, టీడీపీల‌కు దిమ్మ తిరిగేలా వ‌చ్చాయి. కాంగ్రెస్‌తో స్నేహం చేసిన‌న్న‌రోజులు బీజేపీపై , వ్య‌క్తిగ‌తంగా మోడీపై చంద్ర‌బాబు, లోకేశ్‌, బాల‌కృష్ణ ఇలా నాయ‌కులంతా దుమ్మెత్తిపోశారు. మోడీ భార్య‌, కుటుంబం గురించి మాట్లాడారు.

తీరా 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజయం పాలైంది. కేంద్రంలో బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చింది. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గ‌త పాల‌న‌లో అవినీతి జ‌రిగిందంటూ సీబీఐ ద‌ర్యాప్తు చేయించి, కేసుల్లో ఇరికించాల‌ని శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఎక్క‌డ జైలుకు పోవాల్సి వ‌స్తుందోన‌నే భ‌యం చంద్ర‌బాబును ప‌ట్టుకుంది. ఎలాగైనా మోడీ -అమిత్‌షా ద్వ‌యంతో స్నేహం కుదుర్చుకోవాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు. ఇది ప్ర‌స్తుత ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిపై బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి సెటైర్లు విసురుతూ ట్వీట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా పాత విష‌యాల‌ను ఆయ‌న గుర్తు చేస్తూ, క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని డిమాండ్ చేయడం విశేషం. గ‌త ఐదేళ్ల పాల‌న‌ను స్వ‌ర్ణ‌యుగంతో కేశినేని నాని వ్యాఖ్యానించ‌డ‌మే విష్ణు ట్వీట్‌కు కార‌ణ‌మైంది.

‘ఏమండోయ్ నాని గారు (కేశినేని నాని).. చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగి పోయి, నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు. 

రోజుకు పదికోట్ల ప్రజల సొమ్ముతో ధర్మపోరాటం, ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశారు. నేడు మీరేమేూ గత ఐదేళ్లు స్వర్ణ యుగం, కేంద్ర మంత్రులందరూ ఏపీకి అండగా నిలిచారని చెప్పారు. తన స్వార్థ రాజకీయూల కోసమే బీజేపీపై తప్పుడు ప్రచారం చేశానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినాగాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి’ అంటూ విష్ణువర్ధన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

గ‌తంలో చంద్ర‌బాబు మొద‌లుకుని టీడీపీ నేత‌లు బీజేపీపై ఘోరంగా విమ‌ర్శ‌లు చేయ‌డం ... ఇప్పుడు ఆ పాలిట శాపంగా మారాయి. బీజేపీకి ద‌గ్గ‌ర కావాల‌ని టీడీపీ ఎంత ప్ర‌య‌త్నిస్తూ ...జాతీయ పార్టీ ద‌య చూప‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం చంద్ర‌బాబు ఊస‌ర‌వెల్లి కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన నేత అని న‌మ్ముతుండ‌డ‌మే. 

అందుకే ఒక్క‌సారి క్యారెక్ట‌ర్ పోగొట్టుకుంటే ... ఆ మ‌నిషిని జీవితంలో మ‌రెవ‌రూ న‌మ్మ‌ర‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. పైగా రాజ‌కీయంగా కూడా చంద్ర‌బాబు ఏమంతా బ‌లంగా లేక‌పోవ‌డం కూడా అత‌న్ని బీజేపీ లెక్క చేయ‌క‌పోవ‌డానికి కార‌ణంగా చెబుతున్నారు.

ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ గుర్తించాలి

 


×