Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రెస్ మీట్ కే అద్దాలు పెడితే.. ఎన్నికల సంగతేంటి?

ప్రెస్ మీట్ కే అద్దాలు పెడితే.. ఎన్నికల సంగతేంటి?

స్థానిక సంస్థల ఎన్నికలపై కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా భయంతో ఆ ప్రెస్ మీట్ కోసం తనకు 3 వైపుల అద్దాలు పెట్టుకున్నారు. కేవలం ఒక ప్రెస్ మీట్ కోసం ఇలా అద్దాలు పెట్టుకున్న రమేష్ కుమార్.. కరోనా వైరస్ కొనసాగుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

"కరోనా లేదని చెప్పి ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్న రమేష్ కుమార్.. ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం చుట్టూ అద్దాలు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారే, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? కరోనాతో ఎవరైనా ఉద్యోగి మరణిస్తే రమేష్ కుమార్ బాధ్యత వహిస్తారా?"

మూడేళ్ల పాటు ఎన్నికలు జరపకుండా కమిషనర్ నిద్రపోయారని  విమర్శించారు అంబటి. ఫైట్ చేయలేదని, కోర్టుకు కూడా వెళ్లలేదని... కనీసం అప్పటి ప్రభుత్వంతో చర్చించలేదని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు 3 మాసాలు ఎందుకు ఆగలేకపోతున్నారో తనకు అర్థంకావడం లేదన్నారు.

"ఈ 3 మాసాల్లోనే ఎన్నికలు పెట్టేయాలనేది రమేష్ కుమార్ ఆలోచన. సీటు ఖాళీ చేసేలోపు  ఏదో చేసేద్దాం అనే తపన. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిపై కక్ష తీర్చుకోవాలనే ధోరణి ఆయనలో కనిపిస్తోంది. నాకు నచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకుంటాను, కలెక్టర్లను ట్రాన్సఫర్ చేసేస్తాను అనే అధికారం-అహంకారం మాత్రమే ఆయనలో కనిపిస్తోంది."

ఎన్నికల కమిషనర్ లో కక్ష, ద్వేషం, అహంకారం, అధికారం మాత్రమే తనకు కనిపిస్తున్నాయని.. విధి నిర్వహణ మాత్రం తనకు కనిపించడం లేదన్నారు అంబటి రాంబాబు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?