Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యో అయ్య‌య్యో...రాజ‌ధాని చేజారిపోయిందే!

అయ్యో అయ్య‌య్యో...రాజ‌ధాని చేజారిపోయిందే!

అమ‌రావ‌తిలోనే ప‌రిపాల‌న రాజ‌ధాని కొన‌సాగించాలంటూ సుమారు 600రోజులకు పైగా చేస్తున్న పోరాటం అంతా వృథా అయి పోయింది. కేంద్ర ప్ర‌భుత్వం ఒకే ఒక్క క‌లం పోటుతో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని విశాఖ‌కు త‌ర‌లిపోయింది.

కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు తీర‌ని అన్యాయం చేసింది....అని టీడీపీ అనుకూల మీడియా గ‌గ్గోలు పెడుతోంది. పెట్రోల్ పెరుగుద‌ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రాజ‌ధానుల ప‌ట్టీక‌లో ఏపీ రాజ‌ధానిగా విశాఖ అని ఉంది. దీంతో భూమి బ‌ద్ధ‌లైన‌ట్టు, ఆకాశం త‌ల‌కిందులైన‌ట్టు స‌ద‌రు మీడియా చేస్తున్న హాహాకారాలు వెగ‌టు పుట్టిస్తున్నాయి.

పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల ప్ర‌భావంపై రాష్ట్రాల్లో అంచ‌నా వేశారా? అంటూ ఎంపీ కుంభ‌కుడి సుధాక‌రన్ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానంగా కేంద్ర ప్ర‌భుత్వం న‌గ‌రాల్లో పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌ను అంచ‌నా వేసింది.

ఈ సంద‌ర్భంగా కేంద్రం విడుద‌ల చేసిన జాబితాలో రాజ‌ధానుల ప‌ట్టిక‌లో ఏపీ రాజ‌ధానిగా విశాఖ‌గా పేర్కొన‌డం ఎల్లో మీడియాకు తీర‌ని వేద‌న మిగిల్చింది. ఎల్లో మీడియా క‌డుపు మంట ఏ స్థాయిలో ఉందో ఈ రాతే ప్ర‌తిబింబిస్తుంది.

"ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి మాటమార్చింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది" అని స‌ద‌రు మీడియా రాసుకొచ్చింది. 

త‌మ‌ ఇష్టాయిష్టాలే రాష్ట్ర‌మంతా ఉండాల‌నే కాంక్ష‌తో... ఇత‌ర ప్రాంతాల అభిప్రాయాల‌ను, మ‌నోభావాల‌ను మీడియా ముగ‌సుటులో క‌ర్క‌శంగా అణ‌చివేస్తుంద‌న‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి? అదేదో ఆ జాబితాలో విశాఖ పేరు ఉన్నంత మాత్రాన అక్క‌డికి త‌ర‌లిపోతున్నంత ఓవ‌రాక్ష‌న్ దేనికో? అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?