cloudfront

Advertisement


Home > Politics - Political News

చరిత్ర సృష్టించిన కుమారస్వామి భార్య!

 చరిత్ర సృష్టించిన కుమారస్వామి భార్య!

రాజకీయ నేతలు అయిన భార్యభర్తలు ఎంతోమంది ఉన్నారు. భారత ప్రజాస్వామ్యంలో భర్త ముందుగా రాజకీయ నేత కావడం.. పదవులు అధిష్టించడం ఆపై భార్యలు రాజకీయాల్లోకి రావడం కొత్త ఏమీకాదు. భర్త మంత్రిగా ఉండి, భార్య ఎంపీగా ఉన్న సందర్భాలు.. భర్త ఎంపీగా, భార్య మంత్రిగా ఉన్న సందర్భాలు కోకొల్లలు. భర్త సీఎం సీటును అధిష్టించలేని పక్షంలో భార్య ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం కూడా జరిగింది. ఇలా భార్యభర్తల రాజకీయాలెన్నో ఉన్నాయి.

ఇక ఇప్పుడు కర్ణాటకలో మరో ఆసక్తిదాయకమైన సన్నివేశం. ఇదేమిటంటే.. భర్త ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుని ఉండగా.. భార్య ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భర్త సీఎం పోస్టులో భార్య ఎమ్మెల్యేగా ఉండటం ఇదే తొలిసారి అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

భార్యభర్తలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చిన వాళ్లు, ఎంపీలుగా పార్లమెంట్ కు వెళ్లిన వాళ్లు ఉన్నారు కానీ.. ఇలా ఒకరు సీఎం హోదాలో మరొకరు ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లడం మాత్రం ఇదే ప్రథమం అంటున్నారు. సతీసమేతంగా అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రమే అని చెబుతున్నారు. ఈ విధంగా అనితా కుమారస్వామి చరిత్ర సృష్టించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్