cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కేబినెట్ భేటీ: విశాఖ ఉక్కుపై మరో గట్టి నిర్ణయం

కేబినెట్ భేటీ: విశాఖ ఉక్కుపై మరో గట్టి నిర్ణయం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని కేంద్రానికి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూనే, ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయాల్ని కూడా మోదీకి రాసిన లేఖలో జగన్ వివరించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయబోతోంది.

మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలపై చర్చించబోతున్నారు. దీంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కార్మిక సంఘాల నేతలకు ఇదివరకే హామీ ఇచ్చారు సీఎం జగన్. ఆ హామీని అమలుచేసే క్రమంలో ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

మూడు రాజధానులపై మరో కీలక అడుగు

మరోవైపు విశాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కూడా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. విశాఖను ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన జగన్ సర్కార్.. దాన్ని అమలు చేయాలని భావిస్తోంది. 

విశాఖలో ఉగాది నాడు సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే సచివాలయన కార్యాలయాలు విశాఖకు తరలించాలంటే కనీసం 2 నెలల టైమ్ పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీనిపై కూడా ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించనున్నారు.

రాబోయే ఎన్నికలపై కూడా

పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే అఖండ విజయం సాధించింది వైసీపీ. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే జోరు చూపించాలని వైఎస్ జగన్ ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

దీనికి సంబంధించి మంత్రివర్గ భేటీలో మరిన్ని అంశాలపై చర్చ జరగనుంది. పంచాయతీ ఓటరుకు కాస్త భిన్నంగా ఉండే మున్సిపల్ ఓటర్ ను ఎలా ఆకర్షించాలనే అంశంపై కూడా ఈరోజు చర్చిస్తారు.

అవీ..ఇవీ

బడ్జెట్, విశాఖ ఉక్కు, మూడు రాజధానుల అంశం, మున్సిపోల్స్ తో పాటు.. విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, నవరత్నాల అమలు, గ్రామ వాలంటీర్ల సమస్యలు, రేషన్ డోర్ డెలివరీ అడ్డంకులు, కరోనాపై చర్యలు లాంటి ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా సమావేశంలో చర్చించబోతున్నారు. 

సాయంత్రానికి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు బయటకు రాబోతున్నాయి.

ఆ పేరు కూడా పలకను

దేశం మౌనం పాటిస్తోంది

 


×