Advertisement

Advertisement


Home > Politics - Political News

కోయంబేడు ప్రభావం మనపై తక్కువే

కోయంబేడు ప్రభావం మనపై తక్కువే

3 రోజుల కిందటి వరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువగా కోయంబేడు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లవే ఉండేవి. కానీ క్రమంగా ఇప్పుడు కోయంబేడు కేసులు కూడా తగ్గాయి. స్థానికంగా నమోదవుతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు గడిచిన 24 గంటల లెక్కలే చూసుకుంటే.. రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఇందులో కోయంబేడు కేసులు 7 మాత్రమే. అంతకు ముందు రోజు నమోదైన కేసులు చూసుకుంటే.. ఏకంగా 66 కరోనా కేసులు నమోదైతే.. అందులో  కోయంబేడు కేసులు 11 మాత్రమే. గత 3-4 రోజులుగా రాష్ట్రంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అంటే.. వలస కార్మికులతో కంటే స్థానికంగానే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్న విషయం అర్థమౌతూనే ఉంది.

ఇక తాజాగా నమోదైన కేసుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 10,240 శాంపిల్స్ ను పరీక్షించారు. వీటిలో 44 మందికి కరోనా సోకినట్టు నిర్థారించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరుకుంది.

కొత్తగా నమోదైన 44 కేసుల్లో చిత్తూరుకు చెందిన ఐదుగురు, నెల్లూరుకు చెందిన ఇద్దరికి కోయంబేడుతో కనెక్షన్ ఉన్నట్టు అధికారులు నిర్థారించారు. ఇక డిశ్చార్జీల విషయానికొస్తే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో డిశ్చార్జీల సంఖ్య 1848కి చేరింది. అంటే.. మొత్తం కేసుల్లో 60శాతానికి పైగా కరోనా నుంచి కోలుకున్నట్టు అర్థం అవుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ హాస్పిటల్స్ లో 767 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాల్లేవు. మొత్తం మృతుల సంఖ్య 56గా ఉంది.  

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?