cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

హతవిథీ.. చివరికి అమరావతికి కాంగ్రెస్ దిక్కయింది!

హతవిథీ.. చివరికి అమరావతికి కాంగ్రెస్ దిక్కయింది!

రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా సమాధి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమే అవుతుంది. ఏపీ కాంగ్రెస్ ని మీడియా పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. 

టీవీ చర్చల్లో అసలు కాంగ్రెస్ నేతలకు స్థానమే లేదు, కనీసం పేపర్లలో కూడా కాంగ్రెస్ వార్తలు కనిపించవు. అయినా కూడా సీనియర్లు కొంతమంది కాంగ్రెస్ ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వారంతా ఇప్పుడు అమరావతి వద్దకు చేరుకున్నారు.

రాష్ట్రంలో ఏ సమస్యా లేకపోవడంతో, అటు అమరావతిని అన్ని పార్టీలు వాడుకుని వదిలేయడంతో.. ఆ అంశానికి, ఈ పార్టీకి జోడీ కుదిరింది. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులతో కలసి నిరసన ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు కూడా పెట్టారు.

ఇక అమరావతి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉద్యమం దారీతెన్నూ లేకుండా పోతున్న పరిస్థితుల్లో టీడీపీ కాడె పడేసింది. భార్య భువనేశ్వరి తన రెండు గాజులు విరాళంగా ఇవ్వగా, జోలె పట్టుకుని మరీ ఊరూవాడా తిరిగిన చంద్రబాబుకి అన్నిచోట్లా వ్యతిరేకత రావడంతో సైలెంట్ అయ్యారు. 

అమరావతి పేరు ఎత్తడానికి, కనీసం ఆ పేరుతో ఓ ట్వీట్ వేయడానికి కూడా వణికిపోతున్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వస్తున్న వ్యతిరేకతతో సతమతమవుతున్నారు.

ఇక బీజేపీ కూడా మా చేతిలో ఏమీ లేదు, రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. జనసేన కూడా తనదాకా వస్తేనే స్పందిస్తానంటోంది. అప్పట్లో రాజధాని రోడ్లపై బైఠాయించి, ముళ్ల కంచెలు తొలిగించి రెచ్చిపోయిన జనసేనాని, ఇప్పుడు ఏసీ గదులకే పరిమితం అయ్యారు. రైతు నాయకులు తన దగ్గరకు వస్తే మాత్రం ఊరడించి పంపిస్తున్నారు.

ఈ దశలో మెల్లగా అమరావతిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మీకు నాయకులు లేరు, మాకు జనం లేరు అంటూ కాంగ్రెస్ నాయకులు అమరావతి ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. ఢిల్లీ స్థాయిలో మీ తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. 

అసెంబ్లీలో ఎలాగూ సీట్లు లేవు కాబట్టి.. పార్లమెంట్ లో తాడో పేడో తేల్చుకుంటామంటూ సవాళ్లు విసిరారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిని రాజధానిగా ఉంచి మిగతా ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కి ఉచిత సలహా పారేశారు.

అదే లాజిక్ ప్రకారం రెండు రాష్ట్రాలు అవసరం లేకుండా, ఉమ్మడి రాష్ట్రంలోనే వెనకపడిన ప్రాంతాల్ని అభివృద్ధి చేసి ఉంచొచ్చుకదా అంటే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు. 

ఇప్పటికే రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు మూడు రాజధానుల్ని అడ్డుకుంటుందన్న చెడ్డపేరు తెచ్చుకోడానికి సిద్ధమైంది. ఏ పార్టీ అండా లేకపోవడంతో అమరావతి రైతులు కూడా కాంగ్రెస్ నాయకుల్ని ఆహ్వానించి ఊరటచెందుతున్నారు. 

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను

 


×