cloudfront

Advertisement


Home > Politics - Political News

పంచాయతీ ఎన్నికలకు బాబు సర్కార్ నో!

పంచాయతీ ఎన్నికలకు బాబు సర్కార్ నో!

పంచాయతీలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మళ్లీ కోర్టునే ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పంచాయతీ ప్రెసిడెంట్ల పదవీకాలం ముగిసి నెలలు గడిచిపోయాయి ఏపీలో. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

అయితే ప్రభుత్వం రకరకాల సాకులు చెబుతూ తప్పించుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే కోర్టు ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి నో చెబుతోంది బాబు సర్కారు. పదవీకాలం ముగిసిన పంచాయతీ ప్రెసిడెంట్లు ఇటీవలే కోర్టుకు ఎక్కింది.

ప్రత్యేక అధికారుల పాలనను రద్దు చేయాలని, అధికారుల స్థానంలో తిరిగి తమకే అధికారం ఇవ్వాలని ప్రెసిడెంట్ల సంఘం కోరిందని, అయితే కోర్టు మాత్రం ఎన్నికలను తక్షణం నిర్వహించాలని తీర్పునిచ్చిందని ఏపీ ప్రభుత్వం అంటోంది. పిటిషనర్లు కోరిన దానికి, కోర్టు తీర్పుకూ సంబంధం లేదు అనేది ప్రభుత్వ వాదన.

కోర్టు తీర్పు ఎలా ఉన్నా.. పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహించాల్సిన సమయం ఏనాడో వచ్చేసింది. ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించుకుండా... కోర్టు తీర్పులో లొసుగులు వెదుకుతుండటం విశేషం. కోర్టు ఏ ఉద్దేశంతో తీర్పునిచ్చినా.. పిటిషనర్లు కోరినది ఏదైనా.. ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం.. మళ్లీ పాత సాకులే చెప్పి.. ఇప్పుడు ఎన్నికలు వద్దు అంటూ వాదిస్తోంది. అదీ సంగతి.

తెలంగాణ వోటింగ్ ఇవాలే... ముళ్లు ఎటువైపు తిరుగనుంది?