Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ సర్కారు లాజిక్.. టీడీపీకి ఝలక్

జగన్ సర్కారు లాజిక్.. టీడీపీకి ఝలక్

మూడు రాజధానులపై హైకోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి జగన్ సర్కారు అఫిడవిట్ దాఖలు చేయడం వైరి వర్గాల్లో కలకలం రేపింది. రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని స్పష్టం చేస్తూనే.. ఈ కేసులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ వివరాలు కూడా ప్రస్తావించింది ప్రభుత్వం. దానితోపాటు.. విభజన చట్టంలోని ముఖ్య అంశాన్ని కూడా కోర్టు ముందుకు తెచ్చింది. ఇప్పటివరకూ విభజన చట్టంలో ఒక రాజధాని ('ఎ' క్యాపిటల్) అనే పదం ఉందంటూ చెత్త లాజిక్ లు తీసిన టీడీపీ అండ్ కో కి ఇది నిజంగా ఊహించని ఎదురు దెబ్బే.

విభజన చట్టంలో ఒక రాజధాని అని చెప్పారు, ప్రస్తుతం వైసీపీ మూడు రాజధానులంటోంది.. అంటే ఇది కేంద్రం చేసిన విభజన చట్టాన్ని ధిక్కరించడమేనంటూ టీడీపీ వాదిస్తోంది. వన్ క్యాపిటల్ అనడానికి, ఓన్లీ వన్ క్యాపిటల్ అనడానికి తేడా తెలియకుండా టీడీపీ వితండవాదం చేయడం హాస్యాస్పదంగా అనిపించినా.. ఇప్పుడు ప్రభుత్వం లేవనెత్తిన వాదనతో వారి నోటికి తాళం పడినట్లయింది.

విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందని, అసలు ప్రత్యేక హోదానే ఇవ్వకపోతే ఇక విభజన చట్టం అమలుని ఎలా లెక్కలోకి తీసుకోవాలంటూ కోర్టుకు విన్నవించింది ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంతకాలం విభజన చట్టం అమలు సంపూర్ణం కానట్టేనని ఏపీ ప్రభుత్వం అభిప్రాయ పడింది. అంటే.. మూడు రాజధానులకు విభజన చట్టానికి లింకు పెట్టి మాట్లాడుతున్న టీడీపీ.. ప్రత్యేక హోదా అంశంపై ఇరుకున పడ్డట్టే.

ఐదేళ్లపాటు ప్రత్యేక హోదాని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఇప్పుడు అమరావతి ఏకైక అజెండాగా టీడీపీ రెచ్చిపోవడం వారికే రివర్స్ లో తగిలింది. విభజన చట్టాన్ని గౌరవించరా, దాన్ని అమలు పరచరా, పార్లమెంట్ ని అగౌరవ పరుస్తారా అని టీడీపీ తీస్తున్న చెత్త లాజిక్ లకు వైసీపీ ఇలా బ్రేక్ వేసిందన్న మాట. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుపై కోర్టు విధించిన స్టే నేటితో ముగిసింది.

టిడిపిని ద్వంసం చేసి, ఆ పునాదులపై ఎదగాలని

సినిమా ప్లాప్ అయితే అంతే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?