cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్యయ్యో.. పవన్ ని చాలా మిస్ అవుతున్నాం

అయ్యయ్యో.. పవన్ ని చాలా మిస్ అవుతున్నాం

ఆవేశంతో ఊగిపోవడం, పిడికిలి బిగించి ఆకాశానికి చూపించడం, జుట్టు సరిచేసుకుంటూ ముందుకు నడవడం,అప్పుడప్పుడు సిగ్గుపడటం, ఆ వెంటనే తన చిన్నప్పటి సంగతులతో నవ్వించడం..ఇలా నవరసాలూ పండించేవారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు ఆ ఎంటర్టైన్ మెంట్ పూర్తిగా ప్రజలకు దూరమైంది. మరీ ముఖ్యంగా ఈ వరదల టైమ్ లో.

లాక్ డౌన్ తొలినాళ్లలో గంట కొట్టి, దీపాలు వెలిగించి కొన్ని ఫొటోలతో అయినా పవన్ కల్యాణ్ తన ఉనికి చాటుకున్నారు. కానీ చాతుర్మాస దీక్షలో పూర్తిగా పవన్ టైపు వినోదం ప్రేక్షకులకు మిస్ అయింది. అప్పటికీ.. ప్రెస్ నోట్ల ద్వారా తన స్థాయికి తగ్గట్టు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు పవన్ కల్యాణ్. అయితే ఈ వరదల టైమ్ లో పవన్ కల్యాణ్ ఫీల్డ్ లో ఉండి ఉంటే.. అబ్బో ఆ ఎపిసోడ్ మరో రేంజ్ లో ఉండేది.

నారా లోకేష్ లాంటివాళ్లే.. బురదలో దిగి.. ఫ్యాంట్ మడతపెట్టి నానా హంగామా చేస్తే, అలాంటి సీన్ లో పవన్ కల్యాణ్ పర్ఫామెన్స్ ఊహించుకోగలమా..? పరిసరాలు సహకరించని సందర్భాల్లోనే పవన్ కల్యాణ్ ఇలాంటి జిమ్మిక్కులెన్నో చేసి చూపించారు. 

రైలులో బాత్రూమ్ పక్కన పుస్తకం చదువుతున్నట్టు ఫోజులు, చెట్టు కింద మట్టి ముంతలో పెరుగన్నం, కారు డిక్కీలో కూర్చుని టీ తాగడం.. అబ్బో.. ఒకటా రెండా, అసలు ఇలాంటి ఫోజులివ్వడంలో ప్రధాని మోడీకి కూడా ఒకరకంగా పవన్ కల్యాణే ఇన్స్ పిరేషన్ అని చెప్పాలి.

అలాంటి పవన్.. వరద/బురద రాజకీయాలను బాగా మిస్ అయ్యారు. మందడంలో రైతుల దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నప్పుడు రోడ్డుపై కూర్చుని, ముళ్లకంచెలు దాటుకుంటూ నానా హంగామా చేసిన పవన్ ఎపిసోడ్ ఇంకా కళ్ల ముందే మెదులుతోంది. 

అలాంటి పవన్ వరదల్లో బైటకు వస్తే ఎన్ని ప్రోమో షాట్లు వస్తాయి, ఎంత ఎలివేషన్ మెటీరియల్ దొరుకుతుంది, ఎన్ని పంచ్ డైలాగులు పుట్టుకొస్తాయి. వీటిన్నిటితో జనసేన సోషల్ మీడియా బ్యాచ్ ఓ ఏడాది కాలం గడిపేసేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిపి అదరగొట్టేది. పాపం... ఆ సందడంతా జనసేన టీమ్ మిస్ అయింది.

సగటు ప్రేక్షకుడికి కూడా పవన్ కల్యాణ్ లేని లోటు బాగా తెలిసొచ్చింది. అటు కరోనా టైమ్ లో సినిమాలు లేక, ఇటు పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి జనాల మధ్య లేక.. అసలు తెలుగు ప్రేక్షకుడికి వినోదం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇప్పటికైనా పవన్ బైటకు రావాలని, ఆయన ఇన్నాళ్లూ జనాల మధ్య లేని లోటు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

నన్నెవడూ పీకలేడు

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

 


×