Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ బంద్ కి పోలీస్ షాక్..!

టీడీపీ బంద్ కి పోలీస్ షాక్..!

చాలా కాలం తర్వాత ఏపీలో ప్రతిపక్షం బంద్ కి పిలుపునిచ్చింది. ప్రతిపక్షం బంద్ అంటే ఎంతో కొంత ప్రభావం కనపడాలి. అయితే ఏపీలో మాత్రం ప్రతిపక్షానికున్న బలం లాగే.. బంద్ ప్రభావం కూడా శూన్యంగా మారింది. టీడీపీ నాయకులు ఒక్క బస్సుని కూడా అడ్డుకోలేకపోయారు, కనీసం రోడ్డుపైకి వచ్చి నినాదాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. 

పోలీసులు రాత్రి నుంచే పక్కా వ్యూహంతో ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను దించారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు జరిగాయి. టీడీపీ బంద్ కి పోలీసులు పక్కాగా షాకిచ్చారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అందరికీ పోలీసులు షాకిచ్చారు.

టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్న వెంటనే ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. అదనపు బలగాలను రప్పించి వైసీపీ నేతల ఆందోళనలను అడ్డుకున్నారు. అదే క్రమంలో టీడీపీ ఈరోజు బంద్ చేపట్టడానికి నిర్ణయించడంతో పోలీసులు ముందస్తు వ్యూహాలను అమలు చేశారు. 

ఉదయం నుంచే బంద్ ని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు రోడ్లపైకి వచ్చాయి. టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ ఇల్లు కదలకుండా అడ్డుకున్నారు. కనీసం బయటకు కూడా రాకుండా లోపలే ఉంచారు. చిన్నాపెద్దా నేతలందరి ఇళ్ల ముందు ఇదే పరిస్థితి. కార్యకర్తలు కూడా రోడ్లపైకి రాకుండా అడ్డుకున్నారు.

బంద్ పేరుతో రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించాలనేది టీడీపీ ఆలోచన. అనుకూల మీడియాతో ఆ హంగామా అంతా జనాలకు తెలిసేలా చేయాలని.. మా సత్తా ఇదీ అని నిరూపించుకోవాలని టీడీపీ చూసింది. కానీ పోలీసులు వారికి ఫస్ట్ అవర్ లోనే షాకిచ్చారు. 

బంద్ అనేది పేరుకే కానీ ఎక్కడా కనపడలేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లకు ముందు జాగ్రత్తగా యాజమాన్యాలు సెలవలు ఇచ్చాయి. ప్రభుత్వ విద్యాలయాలు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి. మరోవైపు వాణిజ్య సంస్థల సంఘాలు కూడా తాము బంద్ పాటించడం లేదని బహిరంగంగా ప్రకటన ఇచ్చి టీడీపీకి షాకిచ్చాయి.

రోడ్లపైకి వస్తే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేందుకు ఉత్సాహం చూపించేవారు టీడీపీ నేతలు. పోలీసుల చర్యలతో ఇంటికే పరిమితం కావడంతో ఎక్కడా తొందరపాటు చర్యలకు దిగలేదు. ఎవరికి వారే ఇంటిలో సైలెంట్ గా ఉన్నారు. కెమెరాలను చూస్తే మాత్రం నినాదాలు చేస్తున్నారు, మీడియా కనపడకపోతే మాత్రం హాయిగా ఇంట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 

చంద్రబాబు పిలుపు ఏమో కానీ, నేతలెవరూ ఇళ్లు దాటేందుకు అవకాశం లేకపోవడంతో టీడీపీ బంద్ ముందుగానే అట్టర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?