Advertisement

Advertisement


Home > Politics - Political News

అచ్చెన్నకు తలంటిన రాజుగారు !

అచ్చెన్నకు తలంటిన రాజుగారు !

కింజరపు అచ్చెన్నాయుడు భారీ మనిషి. ఆయన ఆరడుగుల విగ్రహం. అంతేనా నోరు కూడా పెద్దదే. ఆయన మాట్లాడారంటే అందులో విషయం పక్కన పెడితే అవతలి పక్షం చచ్చినట్లు భయపడాల్సిందే. అందుకే ఆయన్ని ముందుపెట్టి చంద్రబాబు బాగా వాడేసుకుంటూ వచ్చారు.

సరే అధికారంలో ఉన్నపుడు ఏకంగా జగన్ మీదేనే ఎగిరెగిరి పడిన అచ్చెన్న ఇపుడు విపక్షంలో షిఫ్ట్ అయ్యాక కూడా ఎక్కడా తగ్గడంలేదు. ఆయనకు  ఇపుడు ఏకంగా తన జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాంతోనే లడాయి పడుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే అచ్చెన్న ఇపుడు భారీ స్కాం లో చిక్కుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో పక్కా ఆధారాలు ఉన్నాయని విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ ఎస్పీ వెంకటరెడ్డి ఓ వైపు చెబుతున్నారు. మరో వైపు మంత్రి జయరాం అచ్చెన్నను అరెస్ట్ చేస్తామని గట్టిగానే హెచ్చరిస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే స్కాములూ, కుంభకోణాలూ నేనేరుగా నేనెరుగా అంటూ అమాయకంగా రియాక్ట్ అవుతున్నారు అచ్చెన్న. అంతటితో ఆగని ఈ మాజీ మంత్రి గారు ఇదంతా ప్రధాని మోడీ చెబితే చేశానని ఏకంగా ఢిల్లీ పెద్దాయన మీదనే తప్పు తోసేస్తున్నారు.

దాని మీద బీజేపీ రాజు గారు బాగా  గుస్సా అయ్యారు. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాని మోడీని ఎందుకు లాగుతున్నారని  విష్ణుకుమార్ రాజు అచ్చెన్నని గట్టిగానే  ప్రశ్నిస్తున్నారు.  ప్రధాని మోడీ సలహాలు, సూచనలు మాత్రమే చేస్తారని, అవినీతి చేయమని చెబుతారా? అని విష్ణుకుమార్ రాజు నిలదీశారు, ఓ విధంగా కడిగేశారు.

ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాని మోడీ చెబితేనే చెశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతి చేయడానికి అలవాటు పడి ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో నిందితులు ఎవరినీ వదలి పెట్టవద్దని ప్రభుత్వాన్ని విష‌్ణుకుమార్ రాజు కోరారు.

అచ్చెన్న ఇంత మాట ప్రధాని మీద‌ అనేసి నేరం నాది కాదు పెద్దాయనదని తోసేసినా బీజేపీ పెద్ద తలకాయలు ఎందుకు మౌనంగా ఉన్నాయో మరి. మరి బీజేపీ రాజు గారికి ఉన్న ధైర్యం వారికి లేదా, లేక పసుపు పార్టీతో ఉన్న తెర వెనక బంధాలు వారి నోటికి అడ్డం పడ్డాయా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా అచ్చెన్న చాలా ధైర్యంగా ప్రధాని పేరు చెప్పడం ఒక విడ్డూరమైతే రాజు గారు ఘాటుగా రిప్లై ఇవ్వడం మరో విశేషం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?