Advertisement

Advertisement


Home > Politics - Political News

అఖిల‌ప్రియా వ‌స్తున్నా...కాచుకోః ఏవీ

అఖిల‌ప్రియా వ‌స్తున్నా...కాచుకోః ఏవీ

క‌ర్నూలు జిల్లాలో ఆళ్ల‌గ‌డ్డ‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్ష‌న్ గ‌డ్డ‌గా పేరొందిన ఆ ప్రాంతం నుంచి బ‌ల‌మైన రాజ‌కీయ ఫోర్సుగా భూమా కుటుంబం వ‌చ్చింది. సోద‌రుల మ‌ర‌ణంతో రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన భూమా నాగిరెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న‌కు కుడి భుజంగా ఏవీ సుబ్బారెడ్డి వ్య‌వ‌హ‌రించేవాడు. భూమా నాగిరెడ్డి, శోభా దంప‌తుల మ‌ర‌ణానంత‌రం ఆళ్ల‌గ‌డ్డ‌లో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతూ వ‌చ్చాయి.

భూమా నాగిరెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, అఖిల‌ప్రియ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. అయితే అస‌లు గొడ‌వెందుకంటే మాత్రం ఇద్ద‌రు నేత‌లు పైకి అస‌లు నిజాలు చెప్ప‌రు. ఏమీ లేదంటూనే...త‌న‌ను చంపేందుకు అఖిల‌ప్రియ ప్లాన్ చేశార‌ని ఏవీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. అంతేకాదు, ఈ ఏడాది మార్చిలో త‌న‌పై హ‌త్యాయ‌త్నాన్ని పోలీసులు ఛేదించార‌ని ఏవీ చెప్పుకొస్తున్నాడు. త‌న‌పై అఖిల‌ప్రియ‌నే కుట్ర ప‌న్నార‌ని ఏవీ ఆరోప‌ణ‌. ఈ విష‌యాన్ని పోలీసుల విచార‌ణ‌లో నిందితులు కూడా చెప్పార‌ని ఏవీ విలేక‌రుల‌తో అంటున్నాడు.

దీనిపై అఖిల‌ప్రియ శుక్ర‌వారం స్పందిస్తూ ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ4 ముద్దాయిగా తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని.. తమ హస్తం ఉన్నట్లు బయటకు రాలేదని ఆమె తెలిపారు. విచారణ కొనసాగు తుండ‌గా త‌న‌ను అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం ఏంట‌ని అఖిల‌ప్రియ ప్ర‌శ్నించారు.  ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ అన్నారు.  ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తాడో చూడాలని ఉందని ఆమె చెప్ప‌డం విశేషం.  

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో  ఏవీ సుబ్బారెడ్డి శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స‌మాధాన‌మిచ్చాడు. టీడీపీ నాయకత్వం చెప్పినా.. అఖిలప్రియతో మాత్రం కలిసి పనిచేయనని తేల్చిచెప్పాడు. త‌న‌కు భ‌యం లేద‌న్నాడు. త‌న‌ను తాను కాపాడుకోగ‌ల‌న‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. 35 ఏళ్లుగా ఫ్యాక్షన్‌ ఫీల్డ్‌లో ఉన్నాన‌ని, అఖిలప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు.

ఫ్యాక్షన్‌ను వదిలేయ‌డం వ‌ల్లే ఒంటరిగా తిరుగుతున్న‌ట్టు ఏవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చాడు. ఆళ్లగడ్డలో రాజ‌కీయాలు చేయాల‌ని అఖిల‌ప్రియ స్వాగ‌తించ‌డంపై కూడా ఏవీ త‌న‌దైన శైలిలో తీవ్రంగా స్పందించాడు. ఆళ్ల‌గ‌డ్డ‌లో తప్పకుండా రాజకీయం చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశాడు. అందువ‌ల్ల అఖిల‌ప్రియ ఇక కొత్త శ‌త్రువుతో పోరాడేందుకు కాచుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌నే విష‌యం ఏవీ మాట‌ల ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంది.

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?