Advertisement

Advertisement


Home > Politics - Political News

విపక్షం వీక్ అయింది అక్కడేనట... ?

విపక్షం వీక్ అయింది అక్కడేనట... ?

రాష్ట్రంలో విపక్షాలు వెరీ వీక్ గురూ. ఈ మాట అంటున్నది మంత్రి అవంతి శ్రీనివాసరావు. దానికి గానూ ఆయన బహు చక్కని విశ్లేషణ కూడా చెప్పుకొచ్చారు. 

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతో కొంత అసంతృప్తి జనాలలో ఉండడం సహజమని ఆయన అన్నారు. అయితే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా నానాటికీ జనాదరణ తమ పార్టీకి దక్కుతోందని అవంతి చెప్పుకొచ్చారు.

పంచాయతీలతో మొదలుపెడితే పరిషత్ ఎన్నికల దాకా చూసుకుంటే వైసీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పీక్స్ కి చేరిందని, ఇది దేశంలో ఎక్కడా ఎవరూ చూడని ఎరగని పరిణామమ‌ని అవంతి అన్నారు. 

నిజానికి విపక్షాలు కనుక గట్టిగా ఉంటే అధికార పార్టీకి వారికి మధ్య పోరు ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఢీ కొట్టే స్థాయిలో సాగుతుంది అన్నారు. అలా కాకున్నా అధికార పార్టీకి 60 శాతం, విపక్షాలకు నలభై శాతం బలమైనా ఉంటుంది, కానీ ఇపుడు చూస్తే వైసీపీ మొత్తానికి మొత్తం ఓట్లు, సీట్లను కైవశం చేసుకోవడం మామూలు విషయం కానేకాదు అన్నారు.

భీమిలీ లాంటి ఒకనాటి టీడీపీ కంచుకోటలలో వైసీపీ జెండా ఎగురుతోంది అంటే అది అచ్చంగా వైసీపీ పట్ల జగన్ పట్ల జనాలకు చెదరని జనాభిమానానికి నిదర్శనమని మంత్రి గట్టిగా చెప్పేశారు. 

ఏది ఏమైనా ఈ అద్భుత విజయం తమ బాధ్యత మరింతంగా పెంచిందని, ఇక మీదట ఇంకా వినమ్రంగా తామంతా ప్రజా సేవకు అంకితం అవుతామని మంత్రి అంటున్నారు. మొత్తానికి ఏపీలో విపక్షం వీక్ నెస్ లోకల్ బాడీ ఎన్నికలు బయటపెట్టాయని ఆయన భాష్యం చెబుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?