cloudfront

Advertisement


Home > Politics - Political News

బీజేపీ ఓకేనట.. ఆ నోటిలో ఎన్ని మడతలు బాబు!

బీజేపీ ఓకేనట.. ఆ నోటిలో ఎన్ని మడతలు బాబు!

మొన్నటివరకు బీజేపీని నోటికొచ్చినట్టు తిట్టారు. రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అంతలోనే బాబు నాలుక మరోసారి మడతడిపోయింది. బీజేపీ తనకు ఓకేనంటూ ప్రకటన ఇచ్చేశారు బాబు. తనకు సమస్య మొత్తం మోడీతోనే అంటూ మాటమార్చేశారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ, బాబు ఇలా తన నోటిలో మడతల్ని బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీకి కేవలం మోడీతోనే సమస్య అని, బీజేపీ అధికారంలోకి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సత్సంబంధాలు పెట్టుకుంటామని ప్రకటించేశారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే నితిన్ గడ్కరీ ప్రధాని అయ్యే సూచనలు ఉన్నాయని, ఆయనతో తెలుగుదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని బాబు చెబుతున్నారు.

కేవలం బీజేపీపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ తో చేతులు కలిపారు చంద్రబాబు. రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఉందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ తెగ ఊదరగొట్టారు. అంతలోనే చంద్రబాబు మాటమార్చారు. గడ్కరీ ప్రధాని అభ్యర్థి అయితే భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్టు మాట్లాడేశారు. ఇంతకంటే అనైతికత ఇంకోటి ఉంటుందా?

ప్రత్యేకహోదా విషయంలో ఇప్పటికే తన నాలుకలో సవాలక్ష మడతల్ని చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తులు విషయంలో కూడా ఇలానే పూటకోమాట మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే బీజేపీని మరోసారి దువ్వాలని చంద్రబాబు వేస్తున్న నక్కజిత్తులకు ఈసారి బీజేపీ పడే ఛాన్స్ లేదు.

చంద్రబాబు నిజస్వరూపాన్ని కళ్లారా చూసి, అతడితో వెన్నుపోటు పొడిపించుకున్న కమలం పార్టీ ఈసారి బాబును చచ్చినా నమ్మదు. పైపెచ్చు అధికారంలోకి వస్తే బాబును ఓ రేంజ్ లో ఆడుకోవాలని కూడా ఫిక్స్ అయింది. అదే ఇప్పుడు బాబుకు నిద్రలేకుండా చేస్తోంది. అందుకే ఓవైపు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కూడా, బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!