Advertisement

Advertisement


Home > Politics - Political News

వింత ప్రవర్తన.. అనుకున్నది సాధించిన బాబు

వింత ప్రవర్తన.. అనుకున్నది సాధించిన బాబు

చంద్రబాబుకి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం సుతరామూ ఇష్టం లేదు. అయితే చేజారిపోతున్న ఎమ్మెల్యేలపై పట్టు సాధించుకునేందుకే, తన అను''కుల'' మీడియాలో హంగామా చేసేందుకు, ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీకి వచ్చారు. వచ్చినా కూడా తన హిడెన్ అజెండాను సైలెంట్ గా అమలు చేసి గంటల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి తుర్రుమన్నారు.

వాస్తవానికి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలనుకున్న ప్రతిపక్షాలు సహనంతో ఉండాలి. తమ వంతు వచ్చే వరకు వేచి చూసి సవివరంగా మాట్లాడాలి. కానీ బాబు దానికి భిన్నంగా అసలు అసెంబ్లీకి వచ్చిందే సస్పెన్షన్ వేటు వేయించుకునేందుకే అన్నట్టుగా వింతగా ప్రవర్తించారు.

తుపాను సమయంలో జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీడీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. సభలో చర్చ జరక్కుండా గందరగోళం సృష్టించారు.

చంద్రబాబు ప్రవర్తన మరీ విడ్డూరంగా ఉంది. మంత్రి సమాధానం చెప్పకుండా అడుగడుగునా అడ్డుతగిలిన బాబు.. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతున్నా కూడా మైక్ తనకి కావాలని అడిగారు. అంతే కాదు పోడియంపైకి దూసుకెళ్లారు.

గతంలో తన ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి పోడియం వద్దకు పంపించే బాబు.. ఈ దఫా తనకు తానే స్పీకర్ మీదకు వచ్చారంటే.. ఆయన ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారో, సస్పెన్షన్ వేటు వేయించుకొని ఇంటికెళ్లడానికి ఎంత ఆత్రుతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు, బాల వీరాంజనేయులు, రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, అశోక్, పయ్యావుల కేశవ్, సత్యప్రసాద్, జోగేశ్వరరావు, బుచ్చయ్య చౌదరిని సభ నుంచి ఒకరోజు సమావేశాలయ్యే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్. దీంతో చంద్రబాబు తాను అనుకున్నది సాధించామన్న విజయ గర్వంతో అక్కడినుంచి నిష్క్రమించారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?