Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబుకు సీఎం పదవి ఉత్తరాంధ్ర బిక్ష !

బాబుకు సీఎం పదవి ఉత్తరాంధ్ర బిక్ష !

చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అందులో ఒకసారి ఆయన మామగారి కోటాలో పదవి అనుభవిస్తే 1999, 2014 ఎన్నికల్లో మాత్రం బాబు బీజేపీ పొత్తులతో పోటీ చేసి ముఖ్యమంత్రి పీఠం పట్టారు. బాబు సీఎం కావడానికి అన్ని ప్రాంతాల ప్రజలూ సహకరించారా అంటే అది పెద్ద ప్రశ్న. దానికి సమాధానం సింపుల్. ఎన్టీయార్ పరమపదించాక రాయలసీమలో టీడీపీ ప్రభ తగ్గిపోయింది. 1999 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి.

ఇక తెలంగాణాలోనూ టీడీపీ  సీన్ రివర్స్ అయింది. మరి బాబుని సీఎం  చేసిన ప్రాంతాలు ఏవీ అంటే కోస్తా, ఉత్తరాంధ్రాలేనని రాజకీయ నిపుణులు చెబుతారు. కోస్తాలో ఆయన సామాజికవర్గం టీడీపీ పల్లకీ పోసినా, ఉత్తరాంధ్రా వారికి బాబు ఎందుకు నచ్చాలన్నదే ఇక్కడ మరో ప్రశ్న. అయితే బాబుని ఉత్తరాంధ్రా ఎపుడూ మోసం చేయలేదు, అక్కున చేర్చుకుంది. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని అంతా వినిపించిన  మాట. రాయల‌సీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వైసీపీ వైపుగా ఉంటే మళ్ళీ ఉత్తరాంధ్రాకే తులాభారం అయింది.

మొత్తం 34 అసెంబ్లీ సీట్లతో పాతిక వరకూ టీడీపీకి కట్టబెట్టి మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ బాబుకు దక్కేలా చేసి సీఎం సీట్లో కూర్చోబెట్టిన ఘనత అచ్చంగా  ఉత్తరాంధ్రాదే. మరి అటువంటి ఉత్తరాంధ్రకు బాబు ముమ్మారు సీఎంగా ఏ మేలు చేశారన్నది  జనాలకు బాగా తెలుసు. ఇపుడు విశాఖను పాలనా రాజధానిగా చేస్తామంటే బాబు విషం చిమ్మడాన్నే జనం తట్టుకోలేకపోతున్నారు. నూటికి తొంబై శాతం మంది బీసీలు ఉన్న ఈ మూడు జిల్లాలపైన ఎందుకు కక్ష బాబూ అని మేధావులు, ప్రజాసంఘాలు నిగ్గదీస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్ర బిక్షతో బాబు సీఎం పదవిని అధిరోహించి ఈ ప్రాంతం అభివ్రుధ్ధిని అడ్డుకోవాలని చూడడం దారుణమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిపైన బాబు రాధ్ద్ధాంతం ఆపకపోతే జనమే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఆ నడుము సీన్లు నాకు సెంటిమెంట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?