cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అంత ఆపుకోలేకపోతున్నావా బాబూ!

అంత ఆపుకోలేకపోతున్నావా బాబూ!

టీడీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. చంద్రబాబు అయితే ఇంట్లో ఆనందంతో గంతులేస్తున్నారట. ఇక బాబు మీడియా సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయినట్టు  అవి ఆల్రెడీ ఊహించేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కారణం ఏంటో తెలుసా.. చంద్రబాబు ఫోన్ ను అమిత్ షా ఎత్తారు. అంతే.. ఆ మాత్రం దానికే టీడీపీ ఆపుకోలేకపోతోంది. బీజేపీతో పొత్తుల వరకు వెళ్లిపోయింది.

ఇంతకీ బాబు ఎందుకు ఫోన్ చేశారు.. అమిత్ షా ఎందుకు ఆ ఫోన్ ఎత్తారు.. మరోసారి ఎయిమ్స్ లో చేరారు అమిత్ షా. అది కేవలం రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ముందుజాగ్రత్త కోసం చేసే పరీక్షలు మాత్రమే. శ్వాస తీసుకోవడంలో చిన్నపాటి ఇబ్బందులు తప్ప ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు.

హోమ్ మంత్రి హాస్పిటల్ లో చేరడంతో చంద్రబాబు పరామర్శ కాల్ చేశారు. ఇలాంటి కాల్స్ ఎవరు చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడ్డం ఆనవాయితీ. రాజకీయంగా ఎంత శత్రువైనా ఇలాంటి కాల్స్ ను ఆన్సర్ చేస్తారు. అమిత్ షా కూడా అదే చేశారు. ఎలాంటి రాజకీయాల్లేవు. ఇది పూర్తిగా కర్టసీ కాల్. ఇంతోటి దానికే టీడీపీ శ్రేణులు చంకలు గుద్దుకుంటున్నాయి.

బీజేపీకి టీడీపీ దగ్గరైపోయిందట. చంద్రబాబు అమిత్ షాతో అన్ని విషయాలు మాట్లాడేశారట. ఇక రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కలిసి పనిచేస్తాయట. ఈ రేంజ్ వరకు వెళ్లిపోయాయి టీడీపీ శ్రేణుల కబుర్లు, బాబు మీడియా కథనాలు. బీజేపీతో చేతులు కలిపేందుకు వాళ్లు ఎంత తహతహలాడుతున్నారనే విషయాన్ని ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.

జగన్ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండేళ్లు కూడా కాలేదు. ఈ 15 నెలలకే యుగాలు గడిచినట్టు ఫీల్ అయిపోతున్నారు చంద్రబాబు. అందుకే జగన్ అధికారికంలోకి వచ్చిన మూడో నెల నుంచే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. మోడీ తానా అంటే తందానా అనడం స్టార్ట్ చేశారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీని పూర్తిగా పక్కనపెట్టింది. కూరలో కరివేపాకులా తీసి పడేసింది. వచ్చే ఎన్నికలనాటికి కూడా ఏపీ-తెలంగాణలో టీడీపీ తనకు పనికిరాదనే విషయం బీజేపీకి ఎప్పుడో అర్థమైపోయింది.

ఈ విషయం బాబు మనసుకు కూడా తెలుసు. కానీ ఏదో మూల ఆశ. మళ్లీ కమలంతో కాపురం పెట్టొచ్చనే భ్రమ. అందుకే ఇలా కర్టసీ కాల్ లిఫ్ట్ చేసినా సంబర పడిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ మోడీతో మాట్లాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చిన బాబు.. ఇప్పుడిలా పరామర్శ కాల్ కే చంకలు గుద్దుకోవడం ఆయన దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?

 


×