cloudfront

Advertisement


Home > Politics - Political News

ఒక నాలుక, 2 మడతలు.. ప్రపంచంలో బాబుకే సాధ్యం

ఒక నాలుక, 2 మడతలు.. ప్రపంచంలో బాబుకే సాధ్యం

- ఏపీలో తిట్టి, ఢిల్లీలో పొగుడుతారట
- ఈ అద్భుతాలు బాబుగారికే సాధ్యం..
- ఢిల్లీలో నారావారి ప్రవచనాలు

యుటర్న్ బాబుకి నాలుక మడతబెట్టడం అలవాటే. చెప్పినదాన్ని చెప్పలేదని చెప్పడం, పొగిడిన నోటితోనే తిట్టడం ఆయనకు నిత్యకృత్యం. అవసరం అనుకుంటే పొర్లుదండాలు పెడతారు, అవసరం తీరాక బండబూతులు తిడతారు. ఇవన్నీ బాబు డిక్షనరీకి ప్రత్యేక ఆకర్షణలు. రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ఆడేవారిని చూసుంటాం, ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేవారిని కూడా చూసుంటాం.

కానీ ఒక వ్యక్తి ఒక జీవిత కాలంలో ఇన్ని యు-టర్న్ లు తీసుకోవచ్చా అనేది మాత్రం చంద్రబాబును చూసే తెలుసుకోవాలి. అలాంటి బాబు ఇప్పుడు మరో అరుదైన ఫీట్ సాధించారు. ఒకేసారి ఒకే విషయాన్ని రెండు విధాలుగా చెప్పారు. తన నాలుకలోని 2 మడతల్ని ఒకేసారి బయటపెట్టారు.

ఢిల్లీ వేదికగా కేంద్ర మీడియా విస్తుపోయేలా చంద్రబాబు స్టేట్ మెంట్ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారట, రాష్ట్రంలో మాత్రం అదే పార్టీతో పోరాడతారట. ఇదేమి స్ట్రాటజీ అని అడిగితే కేంద్రంలో కాంగ్రెస్ తో పొత్తు ప్రజాస్వామ్య  పరిరక్షణ కోసమట. రాష్ట్రంలో పోటీ రాజకీయ అవసరమట.

ఈ స్టేట్ మెంట్ చూసి రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న జర్నలిస్ట్ అయితే బాబు ఒకేసారి రంగులు మార్చడం చూసి అవాక్కయ్యాడు. ఇప్పటివరకూ చంద్రబాబు నాలుక మడతబెట్టి అబద్ధాలు చెప్పడమే చూశాం. ఇప్పుడు ఆ నాలుకలోని రెండు మడతల్ని ఒకేసారి ఇలా చూపించారు బాబు.

చంద్రబాబు చేస్తున్న రాజకీయ వ్యభిచారంలో ఇదో కొత్త కోణం. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుని తెలుగు ప్రజలు ఎప్పటికీ హర్షించరు అనే విషయం తెలంగాణ ఫలితాలతో స్పష్టమైంది. అదే సమయంలో బాబుతో పొత్తు పెట్టుకోడానికి ఇక ఏ పార్టీ మిగల్లేదు. అందుకే కాంగ్రెస్ తో డబుల్ గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోడు కానీ, కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ ఒడిలో కూర్చొని ప్రయాణం సాగిస్తారట.

ఎవరేమనుకున్నా ఇదే బాబు మార్క్ రాజకీయం. ఆయన స్టయిల్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇదే. ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం, ప్రపంచ రాజకీయాల్లో ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమని మరోసారి రుజువైంది.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు