Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు ఎత్తుగడ వికటిస్తుందా?

బాబు ఎత్తుగడ వికటిస్తుందా?

బాబుగారు ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనుకున్నారు. కానీ అది కాస్తా వికటించేలా వుంది.  ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతిని పట్టుకుని పోరాడడం వల్ల ఉత్తరాంధ్ర జనాలకు ఆయన మీద మండుతోంది. దానిని చల్లార్చడం ఎల్లా? అలాగే ఎన్నికల టైమ్ లో బిసిలు తనకు, తన పార్టీకి దూరమై, వైకాపాకు దగ్గరయ్యారు. వారిని మళ్లీ లాగేదెలా? అందుకే ఈ ఎత్తుగడ.

ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెంనాయుడుని అక్కున చేర్చుకుని, పార్టీ అధ్యక్షుడిని చేసారు. పనిలో పనిగా ఉత్తరాంధ్ర దేశం నేతకు తెలుగుదేశం అధ్యక్షపదవి అందించారు. పైగా అచ్చెంనాయుడు బిసి వెలమ కులానికి చెందిన నాయకుడు. ఆ విధంగా బిసిలను అక్కున చేర్చుకున్నాను అనే పాయింట్ కు పనికి వస్తుంది.

కానీ ఈ రెండూ కూడా 2019 ఎన్నికల నాటి పాయింట్లే. ఎలా అంటే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా వున్న కళా వెంకటరావు కూడా ఉత్తరాంధ్ర నాయకుడే. పైగా ఆయన కూడా బిసి కాపు కులానికి చెందిన వ్యక్తి. అంటే బాబుగారు నీ ఎడం చేయి తీయి, నా పుర్ర చేయి పెడతా అనే సామెత మాదిరిగా చేసారన్నమాట.

ఉత్తరాంధ్ర బిసి నాయకుడిని ఉత్తరాంధ్ర బిసి నాయకుడితోటే రీప్లేస్ చేసారు. కానీ దానిని ఏదో కొత్తగా ఉత్తరాంధ్ర నేత, బిసి నేత అన్నట్లు కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఓ గమ్మత్తు కూడా వుంది. ఎంత బిసి కోటాలో వున్నా, ఆ ఇద్దరూ కాపు, వెలమ గానే గుర్తింపు వుంది కులాల లెక్క ప్రకారం. ఎంత బిసిలు అయినా ఉత్తరాంధ్రలో అటు కాళింగ, ఇటు కాపు, మరోపక్క వెలమ, గవర ఈ నాలుగు కులాల మధ్య సఖ్యత అంతంత మాత్రమే. 

అందువల్ల ఇప్పుడు కాపుల నుంచి పదవి పీకేసి వెలమలకు ఇచ్చినట్లు అయింది. దీని ప్రభావం ఇంతో అంతో వుండక మానదు. అసలే కాపులందరినీ జనసేన మీదుగా భాజపావైపు మళ్లించే కార్యక్రమం జరుగుతోంది.

బాబుగారు అద్భుతమైన ఎత్తు వేసా, ఒక దెబ్బకు రెండు పిట్టలు పడి తీరాల్సిందే అనుకుంటున్నారేమో కానీ ముందుగా వున్న పిట్టలు మరి కొన్ని ఈ వంకన చేజారిపోయే ప్రమాదం వుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బాబుగారు ఎప్పుడూ వెలమలకే ప్రాధాన్యత ఇస్తారని, గవర్లు, కాళింగులకు ఎప్పటి నుంచో గుర్రుగా వుంది. ఇప్పుడు అది మరింత పెరుగుతుంది. 

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఇలా చేయడం అన్నది వికటించే అవకాశం వుంది. సందేహం వుంటే కొన్నాళ్లు వేచి వుంటే క్లారిటీ వస్తుంది.

కాపుల మధ్య కుల రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?